Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళలపై లైంగిక వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్

మహిళలపై లైంగిక వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్

వార్త 2 months ago

ఎంత వారైన వారిపై కఠిన చర్యలు తో పాటు ఉద్యోగం నుండి సస్పెన్షన్

Collector Himanshu Shukla: మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం లోని తిక్కన భవన్ లో ఎ.ఆర్.డి స్వచ్చంద సంస్థ సౌజన్యంతో ఐ.సి.డి.యస్ వారు ఏర్పాటు చేసిన జిల్లా స్తాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

పని ప్రదేశాలలో మహిళలపై అఘాయిత్యాలకు,లైంగిక వేధింపులకు గురిచేసిన వారు ఎంత వారైన సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తో పాటు ఉద్యోగం నుండి సస్పెన్షన్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పష్టం చేసారు. ఈ సందర్బంగా జిల్లా కలక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు మండల స్థాయి కార్యాలయాలలో, జిల్లా స్థాయి కార్యాలయాలలో ఇంటర్నల్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేసి వారికి చట్టం, కమిటి ఆవశ్యకతను తెలిసేలా అవగాహ కల్పించాలన్నారు.

Read Also:2024 AP Elections : ఏపీ ఎన్నికల ఫలితాలపై బొత్స మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు

అందరూ సమానమే

ఇటీవల తమకు వచ్చిన, అందిన సమాచారం మేరకు మండల రెవిన్యూ అధికారి పై కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మహిళలు తమకు పని ప్రదేశాలలో జరిగిన అన్యాయలాను నిర్భయంగా ఆ యా కార్యాలయ ఇంటర్నల్ కమిటీలకు తెలియచేయాలన్నారు. ఈ రోజు జిల్లా స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం సంతోషకరం అన్నారు. చిన్న పిల్లలచేత వీధులలో బిచ్చమెత్తుకొనే విధంగా చేసే వారి లీడర్లను గుర్తించి వారి పేర్లను తెలియ చేయాలని అన్నారు. పిల్లలను రక్షించి వారికి సరైన మార్గ నిర్దేశం చేయవలసిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఆడ, మగా తేడా లేదని, అందరూ సమానమేనని అన్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన ముఖ్య మంత్రి పర్యటనలో మగ అధికారులు కంటే మహిళా అధికారులు క్రషి అభినందనీయమని, వారి వల్లే ముఖ్య మంత్రి పర్యటన విజయవంతం అయిందని కొనియాడారు.

త్వరలో చిన్న పిల్లలపై జరుగతున్న అమానవీయ సంఘటనల నివారణకై పోక్సో చట్టంపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళలపై జరుగతున్న వేధింపుల కేసులను సరైన సమయంలో సరైన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ అధికారిని హేమా సుజన్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 304 వరకు ఇంటర్నల్ కమిటీలు ఏర్పడ్డాయని అన్నారు. పని ప్రదేశాలలో మహిళల ఇబ్బండులును, సమస్యలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. మహిళలు నిర్భయంగా ముందుకు వచ్చి వారికి జరిగిన అన్యాయాలను తెలియ చేయాలని తెలిపారు.

 Nellore

మానసిక స్థైర్యం మహిలలో ఉండాలి

జిల్లా సఖి-1 సెంటరు ను ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడైనా సమస్యలు పిర్యాదు చేయవచ్చారు. పిర్యాదు చేసిన 90 రోజులలో పరిష్కారం సూచించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమములో డ్వామా పి.డి గంగా భావాన్ని, బి.సి.కార్పోరేషన్ అధికారి నిర్మలా దేవి మాట్లాడుతూ సున్నిత విషయాలను తెలియచేసే మానసిక స్థైర్యం మహిలలో ఉండాలని, చట్టం పై అవగాహన కలిగి ఉండాలని, అదేవిధంగా ఆయా శాఖల అధికారులు భాద్యత వహించాలని అభిప్రాయ పడ్డారు.

తొలుత యాక్షన్ ఎయిడ్ స్వచ్చంద సంస్థ ప్రతినిధి వందన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలను విశదీకరించారు. ఎ.ఆర్.డి సంస్థ ప్రతినిధి బహీర్ మాట్లాడుతూ స్మైల్ సంస్థ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యాక్రమములో వివిధ శాఖల జిల్లా అధికారులు, స్వ్యచ్చంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.అనంతరం అధికారులు, స్వచ్చంద సంస్థ ప్రతినిధులతో కలసి పోస్టర్ ను ఆవిష్కరించారు.

Read Also hindi news: hindi.vaartha.co

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ప్రత్యేక అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించండి: కలెక్టర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha