Dailyhunt
పట్టపగలు తనిఖీ పేరుతో బంగారం షాపులో లూటీ

పట్టపగలు తనిఖీ పేరుతో బంగారం షాపులో లూటీ

వార్త 1 week ago

బంగారం వ్యాపారి కి బేడీలు వేసి ఉడయించిన దొంగలు

కిలో బంగారం ఆభరణాలు అపహణ రూ. 1.65 కోట్లు విలువ

ఘటనా స్థలాన్ని పరిశీలించిన క్రైమ్ ఎఎస్పీ శ్రీనివాసరావు

Read Also: Nellore: ప్రత్యేక అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించండి: కలెక్టర్

Kashibugga Jewelry Robbery: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని నిత్యం రద్దీగా ఉండే కాశీ బుగ్గ నిత్యానంద నగర్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర జ్యుయలరీ దుకాణంలో మంగళవారం చోరీ జరిగింది. రూ. 1.65 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలను ముఠా దొంగలు దోచుకున్నారు. బంగారు యజమానికు బేడిలు వేసి లాకర్, దుకాణంలో ఉన్న బంగారు ఆభరణాలను అపహరించారు. బంగారు యజమాని, కాశీబుగ్గ పోలీసులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.కాశీబుగ్గ నిత్యానంద నగర్ లో శ్రీ వెంకటేశ్వర బంగారం దుకాణం ఉంది. కిల్లంశెట్టి రామకృష్ణరావు కొద్ది సంవత్సరాలుగా జూయలరీస్ షాపును నిర్వహిస్తున్నారు.

మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసు పేరుతో ఉన్న బనియన్లు వేసుకొని ఇద్దరు వ్యక్తులు షాపులోకి ముందుగా వెళ్లారు. అనంతరం వారి వెంట మరో ముగ్గురు వ్యక్తులు వెళ్లి రామకృ షారావు చేతికి బేడీలు వేసి పోలీసులుగా నమ్మకం కలిగించారు. అనంతరం మరో వ్యక్తి లోపలకు ప్రవేశించి ముఖంపై ముష్టిఘాతాలు కురిపిస్తు తుపాకీ తీసి బెదిరించాడు. అనంతరం బంగారు ఆభరణాలు దొంగిలించడంతో పాటు ఆయనపై ఉన్న బంగారు ఆభరణాలు సైతం దోపిడీ చేసి పరారీ అయ్యారు.

 Huge robbery at Kashibugga Jewelry Shop

రంగంలోకి పోలీసులు

సుమారు రూ. 1.65 కోట్లు విలువ చేసే ఆభరణాలు దొంగతనం జరిగినట్లు షాప్ యజమాని చెబుతున్నాడు. ఈ దోపిడీలో ఎనిమిది మంది ఉన్నట్లు తెలుస్తోంది. దొంగల చిత్రాలు సిసి కెమేరాల్లో నిర్లిప్తమయ్యాయి అయితే ముఖాలకు మాస్కులు వేసుకోవడంతో వారు ఏ ప్రాంతానికి చెందిన వారో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ విషయం ఒక్కసారిగా పట్టణమంతా వ్యాపించగా విషయం తెలుసుకున్న కాశీబుగ్గ సిఐ వై రామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జరిగిన ఘటనను సిఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్ళారు. దీంతో జిల్లా క్రైమ్ ఎఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించగా క్లూస్ టీం, డాగ్స్ స్క్యాడ్ టీంలు పరిశీలించాయి.

దుకాణానికి దొంగల ముఠా నాలుగు ద్విచక్రవాహనాలు, ఒక కారులో వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సిసి కెమెరాల్లో నిర్లిప మై న దొంగలను గుర్తించారు. మొత్తం నాలుగు బృందాలు నియమించి దొంగల కోసం వెతుకుతున్నామని జిల్లా ఎఎస్సీ పి. శ్రీనివాసరావు విలేకర్లకు తెలిపారు. కొద్ది రోజుల్లోనే దొంగలను పట్టుకోవడం జరుగుతుందని ఎఎస్పి విలేకర్లకు తెలిపారు. దొంగల కోసం మొత్తం నాలుగు పోలీసు బృందాలు ఏర్పాటు. చేసారు. క్లూస్ బృందాలు, క్రైమ్ బృందాలు, డాగ్కింట్లు రంగంలో దిగి మొత్తం వ్యవహారంను పరిశీలించాయి. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రామకృష్ణ తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మహిళలపై లైంగిక వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha