Nara Lokesh Challenge YS Jagan: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీవ్రస్థాయిలో సవాల్ విసిరారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన మెగా డీఎస్సీ, ఉద్యోగ నియామకాలపై విమర్శలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. “నేను జగన్ ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలోనే నిలబడి మాట్లాడుతున్నా.. గొడ్డలి పార్టీ నేతల్లా బురద చల్లి పారిపోయే రకం కాదు నేను” అంటూ లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కూటమి ప్రభుత్వం చేపడుతున్న డీఎస్సీ నియామకాలపై ఎవరికైనా ఎలాంటి అనుమానాలున్నా సమాధానం చెప్పేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని లోకేష్ స్పష్టం చేశారు. సవాల్ స్వీకరించే ధైర్యం ఉన్న వాళ్లు నేరుగా చర్చకు రావాలని పిలుపునిచ్చారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్ని జన్మలెత్తినా ఇప్పుడు జరుగుతున్న డీఎస్సీ నియామకాలను ఆపలేడు. జగన్ తన ఐదేళ్ల పాలనలో కనీసం ఒక్క డీఎస్సీ అయినా సక్రమంగా నిర్వహించి ఉంటే.. ఆయనకు హారిజంటల్, వర్టికల్ రిజర్వేషన్లు అంటే ఏంటో అర్థమయ్యేవి” అంటూ ఎద్దేవా చేశారు. తాము గత ప్రభుత్వంలా ‘సాక్షి’ పేపర్ క్యాలెండర్ కాకుండా, నిరుద్యోగుల కోసం నిజమైన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నామని వెల్లడించారు.
Read Also : Nara Lokesh: కూటమి విజయాలను ప్రతి ఇంటికీ చేరవేయాలి..టీడీపీ శ్రేణులకు లోకేశ్ పిలుపు
Minister Nara Lokesh challenges Jagan.
Nara Lokesh Challenge YS Jagan: మహిళలను కించపరిచే సంస్కృతి వైఎస్సార్‌సీపీది.. టీడీపీది కాదు!
వైసీపీ రాజకీయ సంస్కృతిపై మంత్రి లోకేష్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. మహిళలను కించపరిచే వారిని, ఇతరులను బూతులు తిట్టేవారిని జగన్ తన చుట్టూ పెట్టుకుంటారని మండిపడ్డారు. గతంలో గుడివాడ అమర్నాథ్ మహిళలను ఉద్దేశించి అద్భుతంగా మాట్లాడారంటూ జగన్ కితాబు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. “భారతిరెడ్డిని లేదా తన కూతుళ్లను, ప్రస్తుత హోంమంత్రిని అవమానించినట్లు ఎవరైనా అవమానిస్తే జగన్ శభాష్ అంటారా?” అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి అలాంటి సంస్కృతి లేదని, తమ పార్టీలో జగన్ కుటుంబసభ్యులను కించపరిచిన వారిపై కూడా తాము కఠిన చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు.
ప్రభుత్వ పాలనపై లోకేష్ మాట్లాడుతూ.. “మా రెండేళ్ల పాలనలో అన్ని పనులు చేసేశామని మేమేం కాలర్ ఎగరేసుకుని తిరగట్లేదు. రాష్ట్రంలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులపైనే మేము పూర్తిగా దృష్టి పెట్టాం” అని వివరించారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఏపీలో రూ.4 వేల పెన్షన్ అందిస్తున్నామని, ఇది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
మంగళగిరిని నంబర్ వన్‌గా నిలబెడతా.. లోకేష్
తన సొంత నియోజకవర్గమైన మంగళగిరి అభివృద్ధిపై లోకేష్ ప్రత్యేక ప్రణాళికలను వెల్లడించారు. మంగళగిరి ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వమ్ము చేయనని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టామని.. రాబోయే రోజుల్లో భూగర్భ డ్రైనేజీ , అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్‌లైన్, అత్యాధునిక విద్యుత్ వ్యవస్థలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రతీకారం చేశారు. అన్ని రంగాల్లో మంగళగిరిని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు నిరంతరం కృషి చేస్తానని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
రూ.1,167 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు నారా లోకేశ్ శంకుస్థాపన!

