Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జగన్‌ను మళ్ళీ సీఎం చేస్తాం.. అంబటి

జగన్‌ను మళ్ళీ సీఎం చేస్తాం.. అంబటి

వార్త 1 month ago

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు కడప జిల్లా పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తనపై నమోదైన కేసుల విచారణ నిమిత్తం జిల్లాకు వచ్చిన ఆయన, తొలుత గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు.

అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబటి చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

Read Also:Tirumala Express: తిరుమల ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ మార్పు.. మే 12 నుంచి కొత్త టైమింగ్స్ ఇవే!

 Ambati Rambabu’s oath in Idupulapaya

Ambati Rambabu: కూటమి ప్రభుత్వాన్ని కూలదోస్తామని శపథం

వైఎస్సార్ ఘాట్ సాక్షిగా అంబటి రాంబాబు ఒక కీలక ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే కూలదోస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే వరకు తాము విశ్రమించబోమని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, దాడులకు పాల్పడినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ధైర్యంగా పోరాడుతామని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై ధ్వజం

ముఖ్యమంత్రి చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికే వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పినట్లు అంబటి గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ తనపై కేసులు పెట్టడం అన్యాయమని మండిపడ్డారు. తన ఇల్లు, కార్యాలయంపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, బాధితుడైన తననే అరెస్ట్ చేయడం రాజకీయ కుట్రలో భాగమని ఆయన దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని విపక్ష నేతలను వేధించడం సరికాదని ఆయన హితవు పలికారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

టీడీపీ మహానాడు వేదిక మార్పు.. కారణం అదేనా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha