Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీడీపీ మహానాడు వేదిక మార్పు.. కారణం అదేనా?

టీడీపీ మహానాడు వేదిక మార్పు.. కారణం అదేనా?

వార్త 1 month ago

TDP Mahanadu 2026: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు వేదికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ ఏడాది మే 27 నుంచి మూడు రోజుల పాటు శ్రీకాకుళంలో ఈ వేడుకలు జరగాలని ముందుగా నిర్ణయించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం వేదికను నెల్లూరుకు మార్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో సిక్కోలు వేదికగా పసుపు జెండా రెపరెపలాడాలని కేడర్ భావించినా ప్రస్తుత పరిస్థితులు మారుతున్నాయి. అధికారిక ప్రకటన వస్తేనే ఈ మార్పుపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read also: CM Chandrababu Pamarru Tour: మే 1న పామర్రుకు సీఎం చంద్రబాబు.. పకడ్బందీగా ఏర్పాట్లు

 TDP Mahanadu 2026 venue Nellore scene

TDP Mahanadu 2026: ప్రధాని మోదీ పర్యటనతో మారుతున్న లెక్కలు

జూన్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానుండటమే ఈ వేదిక మార్పుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటు ఉత్తరాంధ్రలో మోదీ భారీ బహిరంగ సభలు ఉండే అవకాశం ఉంది. ఒకే సమయంలో రెండు భారీ కార్యక్రమాలు ఉండటం వల్ల భద్రత, ఏర్పాట్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని పార్టీ భావిస్తోంది. అందుకే వ్యూహాత్మకంగా శ్రీకాకుళం ప్లాన్ పక్కన పెట్టి నెల్లూరు వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

నెల్లూరులో ఏర్పాట్లపై చంద్రబాబు కసరత్తు

మహానాడు నిర్వహణకు నెల్లూరు జిల్లాలో ఉన్న అనువైన ప్రదేశాలను పార్టీ నేతలు ఇప్పటికే పరిశీలిస్తున్నారు. రవాణా సౌకర్యాలు, వసతి మరియు జన సమీకరణకు ఇబ్బంది లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఏడాది కడపలో విజయవంతంగా మహానాడు ముగియడంతో ఈసారి కూడా దక్షిణ కోస్తాలో పట్టు నిలుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇచ్చి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ప్రధాని పర్యటనకు అడ్డంకి లేకుండా పండగ చేసుకోవడమే ఇప్పుడు టీడీపీ లక్ష్యం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సైకో పార్టీ సినిమాకు శుభం కార్డు వేసేది పసుపు సైన్యమే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha