ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రక తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి నారా లోకేష్ అత్యంత శక్తివంతంగా తన గళాన్ని వినిపించారు.
“ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని” అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఈ తీర్మానం ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు శాశ్వత పునాది వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమరావతి కేవలం ఒక నగరం కాదని, అది తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొంటూ సభలో ‘జై అమరావతి’ అని నినదించారు. అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూనే, రాజధానిగా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు.
Read Also : Telangana: అక్రమ మైనింగ్‌పై రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

రైతుల పోరాటం.. గత ప్రభుత్వ అణచివేత
రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై గత వైసీపీ ప్రభుత్వం సాగించిన అణచివేతను లోకేష్ ఈ సందర్భంగా ఎండగట్టారు. అమరావతి ఉద్యమ సమయంలో మహిళా రైతులపై జరిగిన దాడులు, వారిని బూట్లతో తన్నడం, జుట్టు పట్టుకుని లాగడం వంటి అమానవీయ దృశ్యాలను ఆయన సభలో ప్రదర్శించి నాటి దారుణాలను గుర్తు చేశారు. హక్కుల కోసం పోరాడిన రైతులకు సంకెళ్లు వేయడం, వారికి మద్దతుగా నిలిచిన మీడియా ప్రతినిధులపై తప్పుడు కేసులు పెట్టడం వంటి చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టినందుకే ప్రజలు జగన్‌ను 151 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. అమరావతి విషయంలో జగన్ అనుకూలమో, వ్యతిరేకమో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు.
జగన్ పాలనపై విమర్శలు!
గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ వ్యవస్థలను ఎలా ధ్వంసం చేశారో లోకేష్ వివరించారు. మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలో అడ్డుకున్నప్పుడు మండలి చైర్మన్‌పైనే దాడికి యత్నించారని, కనీసం చైర్మన్ సంతకం కూడా లేకుండా బిల్లును గవర్నర్‌కు పంపిన అప్రజాస్వామిక విధానాలను ఆయన ఎత్తిచూపారు. జగన్ పాలన తీరును చూసి పారిశ్రామికవేత్తలు ఇప్పటికీ భయపడుతున్నారని, “జగన్ మళ్లీ రారని గ్యారెంటీ ఇస్తారా?” అని తనను అడుగుతున్నారని లోకేష్ పేర్కొన్నారు. అమరావతికి రావాలంటే పరదాలు కట్టుకుని తిరిగిన జగన్, ప్రస్తుతం కీలక చర్చ జరుగుతుంటే అసెంబ్లీకి రాకుండా బెంగళూరులో పడుకున్నారో లేక టీవీ చూస్తున్నారో ఆత్మలకే తెలియాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
తల్లి బతికే ఉందని నమ్మించి ఏడేళ్లుగా పెన్షన్ తీసుకున్న ప్రబుద్దుడు

