Imran Khan Death Rumours: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ (73) జైలులోనే మరణించి ఉండవచ్చంటూ వస్తున్న ప్రచారంతో ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది.
అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ (Official Confirmation) లేదు.
Read Also :Pakistani Spy Arrested : పాకిస్థాన్ గూఢచారి అరెస్ట్ - భారతీయ సైన్యం, రైల్వే సమాచారం లీక్
జర్నలిస్ట్ వ్యాఖ్యలు & వివాదం
అమెరికాలో నివాసముంటున్న పాకిస్థానీ సీనియర్ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు జీవించి లేరని ముగ్గురు సీనియర్ పాక్ సైనిక అధికారులు తనకు తెలిపినట్లు చెప్పారు. అయితే, సదరు సైనిక అధికారులు కూడా ఈ సమాచారాన్ని స్వయంగా ధ్రువీకరించలేదని, కేవలం అనధికారిక మార్గాల ద్వారా తమకు తెలిసిందని మాత్రమే వెల్లడించినట్లు జర్నలిస్ట్ స్పష్టం చేశారు.
జైలు పరిస్థితులు & PTI పార్టీ ఆందోళన

పలు కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైలు (Adiala Jail) లో శిక్ష అనుభవిస్తున్నారు. జైలులో ఉన్న ఇమ్రాన్‌ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులను, న్యాయవాదులను అనుమతించడం లేదని పిటిఐ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆయనకు తగిన వైద్య సహాయం కూడా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని, ఆయనతో ములాఖత్‌కు అనుమతించకపోతే సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్‌కు 'లాంగ్ మార్చ్' చేపడతామని పిటిఐ హెచ్చరించింది.
Imran Khan Death Rumours: పాకిస్థాన్‌పై అంతర్జాతీయ ఒత్తిడి
ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ జైలు నిర్బంధ పరిస్థితులపై అమెరికా నుంచి కూడా పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. 13 మంది అమెరికా చట్టసభ సభ్యులు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు లేఖ రాశారు. ఇస్లామాబాద్ పాలకులతో మాట్లాడి ఇమ్రాన్ ఖాన్ మానవ హక్కులు, వైద్య భద్రతను సమీక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు.
పాకిస్థాన్ డ్రోన్ ఆయుధాల నెట్‌వర్క్ గుట్టురట్టు - నలుగురు అరెస్ట్

