Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జలమండలి ట్యాంకర్ల కొత్త ధరలు విడుదల

జలమండలి ట్యాంకర్ల కొత్త ధరలు విడుదల

వార్త 3 weeks ago

Treated water supply:హైదరాబాద్ నగరంలో నీటి కొరతను ఎదుర్కొనేందుకు జలమండలి శుద్ధి చేసిన మురుగునీటిని మానవేతర అవసరాలకు సరఫరా చేయాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా హైదరాబాద్‌లో శుద్ధి చేసిన నీటి సరఫరా విధానాన్ని తీసుకువచ్చింది. నిర్మాణ రంగం, కార్ వాషింగ్ కేంద్రాలు, గార్డెనింగ్, స్విమ్మింగ్ పూల్స్ తదితర అవసరాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించనుంది. ఇందుకోసం 27 ఫిల్లింగ్ కేంద్రాలను గుర్తించి, తొలి విడతలో 21 గ్రీన్ ట్యాంకర్లను సిద్ధం చేసింది. ఈ విధానం ద్వారా తాగునీటి డిమాండ్ 20 శాతం తగ్గుతుందని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు

 hyderabad treated water supply

రోజుకు 1500 మిలియన్ గ్యాలన్ల మురుగునీటి మళ్లింపు

నగరంలో జలమండలి ఆధ్వర్యంలో 45 మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో శుద్ధి చేసిన నీటిని ప్రస్తుతం పెద్ద మొత్తంలో మూసీలోకి విడుదల చేస్తున్నారు. రోజుకు సుమారు 1500 మిలియన్ గ్యాలన్ల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నీటిని మానవ వినియోగానికి కాకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తే తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా రోజుకు 646 ఎంఎల్‌డీల శుద్ధి చేసిన నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Treated water supply:గ్రీన్ ట్యాంకర్ల ధరలను ఖరారు చేసిన జలమండలి

గ్రీన్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు జలమండలి ధరలను కూడా ఖరారు చేసింది. 5 వేల లీటర్ల ట్యాంకర్‌ను 4 కిలోమీటర్ల పరిధిలో సరఫరా చేస్తే రూ.400 వసూలు చేస్తారు. ఆపై ప్రతి కిలోమీటరుకు రూ.55 అదనంగా చెల్లించాలి. 10 వేల లీటర్లకు రూ.800, 4 కిలోమీటర్లు దాటిన తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.65 వసూలు చేస్తారు. 20 వేల లీటర్ల ట్యాంకర్‌కు రూ.1,600 నిర్ణయించారు. 4 కిలోమీటర్ల తర్వాత ప్రతి అదనపు కిలోమీటరుకు రూ.80 చెల్లించాలి. నాణ్యతను ప్రత్యేక బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది.

Epaper: epaper.vaartha.com

ఇందిరమ్మ ఫ్లాట్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే డ్రా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha