Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలి

జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలి

వార్త 3 months ago

District Collector Pratima Singh: రామాయంపేట : జనగణన 2027లో భాగంగా సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని, జనాభా గణన, గృహ బాబితా కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.

Read Also:Medak Chilapalli Mega Robbery: పోలీసులకు సవాలుగా మారిన భారీ చోరీ!

శనివారం రామాయంపేట మండలం అక్కన్నపేట్ గ్రామంలో జనగణన 2027 ఇండ్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఆర్డిఓ రమాదేవి ,తాసిల్దార్ రజిని కుమారి, ఎంపీడీవో షాజీలుద్దిన్, గ్రామ సర్పంచ్ యాదగిరి తో కలిసి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యటించి, హౌస్ లిస్టింగ్ (ఇంటింటి సర్వే) ప్రక్రియను కలెక్టర్ స్వయం గా పర్యవేక్షించారు.

District Collector Pratima Singh: ఎన్యుమరేటర్లకు ప్రజలు ఖచ్చితమైన వివరాలను అందించాలని సూచించారు

సేకరించిన వివరాలన్నీ గోప్యంగా ఉంటాయాని..ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అనుభవజ్ఞులైన సిబ్బందిని జనగణన సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లుగా నియమించి వారికి అవసరమైన శిక్షణ అందించడం జరిగిందన్నారు జనగణన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, జనగణనలో భాగస్వామ్యులు అయ్యే బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉందన్నారు. ఈ నెల 11 నుండి జూన్ 9 వరకు జరిగే ఇండ్ల గణన సర్వేను పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎన్యూమరేటర్లకు కలెక్టర్ తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha