Lingamaneni Ramesh: జనసేన పార్టీకి దక్కిన రాజ్యసభ స్థానానికి సంబంధించిన అభ్యర్థి ఎంపికపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌ను తమ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు.
శుక్రవారం సాయంత్రం జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు తుది నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు ధృవీకరించాయి. ఈ ప్రకటన వెలువడిన వెంటనే నామినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు జరిగాయి. శనివారం మధ్యాహ్నం లింగమనేని రమేష్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.
RajyaSabhaCandidate
Read also:AP Mega DSC: డీఎస్సీ నియామకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్ పై ప్రభుత్వ సమగ్ర వివరణ
పవన్ కల్యాణ్‌తో దశాబ్ద కాలపు ప్రయాణం
లింగమనేని రమేష్‌కు, జనసేనానికి మధ్య గత పదేళ్లుగా బలమైన అనుబంధం ఉంది. ఆయన 2015 నుంచి పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన పార్టీ విధానాలతో కలిసి నడుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి సాధించాలన్నా, సమాజంలో మార్పు రావాలన్నా సామాజిక వర్గాల మధ్య సామరస్యం, ‘సోషల్ ఇంజినీరింగ్’ ఎంతో అవసరమనే పవన్ కల్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై రమేష్ ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారని పార్టీ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.
Lingamaneni Ramesh: కష్టకాలంలో అండగా నిలిచినందుకే పెద్దల సభకు..
2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ.. రమేష్ మాత్రం పార్టీ ఆశయాలపై, పవన్ కల్యాణ్ లీడర్‌షిప్‌పై ఎక్కడా నమ్మకం కోల్పోలేదు. గత కొన్నేళ్లుగా ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు, వ్యక్తిగత సవాళ్లు ఎదురైనప్పటికీ జనసేన జెండాను వీడకుండా అండగా నిలిచిన వారికి.. కులమతాల సమీకరణాలతో సంబంధం లేకుండా తగిన ప్రాధాన్యత ఇస్తామని పవన్ కల్యాణ్ గతంలోనే ప్రకటించారు. ఆ సూత్రానికి కట్టుబడే, కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న లింగమనేని రమేష్‌ను ఈ ఉన్నత పదవికి ఎంపిక చేసినట్లు జనసేన వర్గాలు స్పష్టం చేశాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

