Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జంతర్ మంతర్ వద్ద నిరసనల నియంత్రణపై సుప్రీంకోర్టులో పిల్

జంతర్ మంతర్ వద్ద నిరసనల నియంత్రణపై సుప్రీంకోర్టులో పిల్

వార్త 4 days ago

Jantar Mantar Protests: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద తరచూ జరిగే ఆందోళనలు, నిరసనల నియంత్రణపై మరియు ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలని కోరుతూ సమర్పించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

లాయర్ సతీష్ చంద్ కౌశిక్ దాఖలు చేసిన ఈ పిల్ పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి (Union Government), ఎన్డీఎంసీ (NDMC) కి నోటీసులు జారీ చేసింది.

Read Also :Arvind Kejriwal: ప్రధాని నివాసానికి అరవింద్ కేజ్రీవాల్ పాదయాత్ర

పిటిషనర్ లేవనెత్తిన ప్రధాన అంశాలు

నిరసనల సమయంలో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లోకి లోపలికి వెళ్లడం, బయటకు రావడం తీవ్ర సమస్యగా మారుతోందని పిల్ పేర్కొంది. నిరసనల ఉధృతి వల్ల స్థానిక ప్రజలకు నిత్యావసర సరుకులు, వైద్య సామగ్రి, అంబులెన్స్ సేవలు వంటి వైద్య అత్యవసర సరఫరా కూడా సక్రమంగా అందడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. జంతర్ మంతర్ పరిసరాన్ని నిరసనల స్థలంగా కొనసాగించడం సరైనది కాదని, దీని స్థానంలో మరొక ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని కేటాయించాలని కోరారు.

Jantar Mantar Protests: సుప్రీంకోర్టు స్పందన

ఈ అంశాలపై సోలిసిటర్ జనరల్ ద్వారా సంబంధిత అధికారుల నుంచి వివరాలు/ఆదేశాలు తీసుకోవాలని ఆదేసిస్తూ విచారణను సుప్రీంకోర్టు తదుపరి విచారణకు వాయిదా వేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాలు - రోడ్లపై పాదచారులకు ప్రత్యేక మార్గాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha