India Israel relations : అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గట్టి కౌంటర్ ఇచ్చారు.
అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌కు అమెరికా ఒక్కటే మిత్రదేశం కాదని, 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశం తమకు అత్యంత నమ్మకమైన స్నేహితుడని ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘ఫాక్స్ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మాట్లాడుతూ.. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలను ఇజ్రాయెల్ విమర్శించడాన్ని తప్పుపట్టారు. ‘నేనే గనుక ఇజ్రాయెల్ కేబినెట్ మంత్రిని అయితే, ప్రపంచంలో మాకున్న ఏకైక శక్తివంతమైన, పెద్ద మిత్రదేశమైన అమెరికాను విమర్శించేవాడిని కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ విదేశాంగ విధానాలపై ఇజ్రాయెల్ అసంతృప్తి వ్యక్తం చేయడం పట్ల వాన్స్ ఈ విధంగా స్పందించారు.
Read Also: Donald Trump: నాటో దేశాలకు ట్రంప్ షాక్: రక్షణ వ్యయం 5 శాతానికి పెంచాల్సిందే!
India Israel relations
India Israel relations : భారత్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించిన నెతన్యాహు
జేడీ వాన్స్ వ్యాఖ్యలపై ఫాక్స్ న్యూస్ ప్రతినిధి ప్రశ్నించగా నెతన్యాహు స్పందిస్తూ.. జేడీ వాన్స్‌పై తనకు గౌరవం ఉందని, అయితే ఆయన చెప్పే ప్రతిదానితో తాను ఏకీభవించనని అన్నారు. ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా ఒంటరి కాలేదని చెప్తూ, భారత్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ తమకు అపారమైన మద్దతు ఇస్తోందని, తన వ్యక్తిగత ఫేస్‌బుక్ ఖాతాను చూస్తే ఇజ్రాయెల్‌కు మద్దతుగా భారతీయుల నుంచి వచ్చే సందేశాల వరద ఏంటో అర్థమవుతుందని వివరించారు.
Epaper: epaper.vaartha.com
అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం.. ట్రంప్‌కు ప్రధాని మోదీ అభినందనలు

