Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజల్ట్స్ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!

జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజల్ట్స్ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!

వార్త 2 weeks ago

JEE Advanced 2026 Results: దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)ల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced-2026) పరీక్ష ఫలితాలను ఐఐటీ రూర్కీ సోమవారం ఉదయం 10 గంటలకు అధికారికంగా విడుదల చేయనుంది.

లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://jeeadv.ac.in/ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వివరాలను నమోదు చేసి స్కోర్ కార్డులు, ఆలిండియా ర్యాంకులను తెలుసుకోవచ్చు.

Read also: TG TET 2026: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

ఈ ఫలితాల విడుదలతో పాటు ఐఐటీ రూర్కీ ఫైనల్ ఆన్సర్ కీ (Final Answer Key), కటాఫ్ మార్కులు (Cut-off Marks) మరియు ఆలిండియా టాపర్స్ (AIR 1 to 10) జాబితాను కూడా ప్రకటించనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన విద్యార్థులు దేశంలోని ఐఐటీలతో పాటు ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జోసా (JoSAA-2026) కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది.

 Procedure to Check JEE Advanced (2026) Results

1. అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి: ముందుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్ బ్రౌజర్‌లో జేఈఈ అడ్వాన్స్‌డ్ అధికారిక వెబ్‌సైట్ https://jeeadv.ac.in/ ను సందర్శించండి.

2. రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేయండి: హోమ్‌పేజీలో ఫలితాలు విడుదల కాగానే కనిపించే “JEE Advanced 2026 Result / Score Card” అనే లింక్‌పై క్లిక్ చేయండి.

3. మీ వివరాలను ఎంటర్ చేయండి: కొత్త పేజీ ఓపెన్ అయిన తర్వాత, అందులో మీ హాల్ టికెట్ నంబర్ (Roll Number), పుట్టిన తేదీ (Date of Birth) మరియు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వివరాలను కరెక్ట్‌గా టైప్ చేయండి.

4. సబ్మిట్ చేసి ర్యాంక్ చూసుకోండి: వివరాలన్నీ ఎంటర్ చేసాక కింద ఉన్న “Submit” బటన్‌పై క్లిక్ చేయండి. వెంటనే మీ సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులు, కటాఫ్ మరియు ఆలిండియా ర్యాంక్‌తో కూడిన స్కోర్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

5. ప్రింట్ తీసుకోండి: భవిష్యత్తులో జోసా (JoSAA) కౌన్సెలింగ్ అవసరాల కోసం ఆ స్కోర్ కార్డును Download చేసుకొని ఒక ప్రింట్ అవుట్ తీసి భద్రపరచుకోండి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

తెలంగాణలోని డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులు పొడగింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha