Dailyhunt
వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాలు చూసుకోవచ్చు..ఎలాగంటే !!

వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాలు చూసుకోవచ్చు..ఎలాగంటే !!

వార్త 1 week ago

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 12వ తేదీన (ఆదివారం) ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు సర్వం సిద్ధం చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకాగా, అందరికీ సులువుగా ఫలితాలు అందేలా బోర్డు ఈసారి వినూత్న ఏర్పాట్లు చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లతో పాటు, సాంకేతికతను జోడించి విద్యార్థుల ముంగిటకే ఫలితాలను తీసుకురావాలని నిర్ణయించింది.

Read Also : Guntur School Bus Accident: స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల బాలుడు మృతి!

వాట్సాప్‌లో ఫలితాలు పొందే విధానం

ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరిగే పనిలేకుండా, ఈసారి విద్యార్థులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా నేరుగా వాట్సాప్‌లోనే మార్కుల జాబితాను పొందవచ్చు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక నంబర్‌ను కేటాయించింది. విద్యార్థులు 80969 58096 నంబర్‌ను తమ ఫోన్‌లో సేవ్ చేసుకుని, వాట్సాప్ నుండి ‘Hi’ అని మెసేజ్ పంపాలి. ఆ తర్వాత ‘BIE Exam Result’ అని టైప్ చేసి, అడిగిన వివరాలు (హాల్ టికెట్ నంబర్) ఎంటర్ చేయడం ద్వారా క్షణాల్లో ఫలితాలను తెలుసుకోవచ్చు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, సర్వర్ సమస్యల నుండి తప్పించుకోవడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

మే నెలలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

ఫలితాల వెల్లడి అనంతరం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in/ ద్వారా కూడా తమ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాల్లో ఎవరైనా అనుతీర్ణులు (ఫెయిల్) అయినా లేదా మార్కులు తక్కువగా వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి కోసం మే నెలలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని బోర్డు సూచన ప్రాయంగా వెల్లడించింది. ఫలితాల అనంతరం రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ షెడ్యూల్‌ను కూడా అధికారులు విడుదల చేయనున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

విజయవాడ-హైదరాబాద్ ప్రయాణం ఇక 2 గంటలే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha