Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో వినూత్నంగా బడిబాట

జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో వినూత్నంగా బడిబాట

వార్త 2 months ago

Pedda Shankarampet Badibata Program: పెద్ద శంకరంపేట (మెదక్) మండల కేంద్రమైన పెద్ద శంకరంపేటలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ బృందం బడిబాట కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు.

గ్రామాలలోని విద్యార్థినిలను పాఠశాలకు ఆకర్షించేందుకు ఉపాధ్యాయ బృందం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు మండల పరిధిలోని రామోజీ పల్లి, వీరోజిపల్లి, ఉత్తులూరు గ్రామాలలో పర్యటించి తమ పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి తల్లితండ్రులను చైతన్యపరిచారు. పిల్లల భవిష్యత్తుకు విద్య ఎంతో అవసరమని వివరించారు.

Read Also:Telangana High Court: మద్యం తాగితే వాహనం సీజ్ చేయకూడదు.. పోలీసులకు కీలక ఆదేశాలు!

 Innovative Badibata at Zilla Parishad Girls’ High School

విద్య ప్రాముఖ్యతను వివరించి పిల్లలను పాఠశాలకు పంపించాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వం పాఠశాలలో కల్పిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫార్మ్స్, విజ్ఞాన యాత్రల గురించి వివరించి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. అలాగే చదువు మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలు చేర్పించడం పై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న బడిబాట కార్యక్రమంలో ద్వారా పాఠశాలలో విద్యార్థులు నమోదు శాతం పెరుగుతుందని ఉపాధ్యాయులు ఆశ భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, ఉపాధ్యాయులు రాధిక, సిద్ధి రాములు, అశ్విని, ప్రసన్న, రమ్య పాల్గొన్నారు.

 Pedda Shankarampet Badibata Program

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఈసారి సరికొత్త రంగులో 'ఇందిరమ్మ చీరలు' పంపిణీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha