Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జిందాల్ వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌లో పవన్ కల్యాణ్ పర్యటన

జిందాల్ వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌లో పవన్ కల్యాణ్ పర్యటన

వార్త 2 months ago

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జిందాల్‌ 'వేస్ట్‌ టు ఎనర్జీ' (చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే) కేంద్రాన్ని సందర్శించారు.

ప్లాంట్‌లోని వివిధ విభాగాలను తిరిగిన ఆయన అక్కడ జరుగుతున్న విద్యుత్ ఉత్పాదన ప్రక్రియను, ప్లాంట్ నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించారు.

Read also: Tirumala Donation: తిరుమలకు రూ.1.13 కోట్ల ఎలక్ట్రిక్ బస్సు విరాళం

విద్యుత్ ఉత్పత్తి, వ్యయంపై ఆరా.. కాకినాడ ప్రాజెక్ట్ ఆలస్యంపై ప్రశ్నల వర్షం

ఈ సందర్భంగా జిందాల్ యాజమాన్యం మరియు ప్రతినిధులతో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చెత్త నుంచి విద్యుత్‌ను తయారు చేయడానికి అవుతున్న ఖర్చు, ప్లాంట్ రోజువారీ నిర్వహణ వ్యయం ఎంత అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్లాంట్ నుంచి ఎంత మేర విద్యుత్ ఉత్పత్తి అవుతోంది? యూనిట్ విక్రయ ధరల వివరాలు ఏంటి? అనే అంశాలను ప్రతినిధులు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఇదే సమయంలో కాకినాడలో నిర్మిస్తున్న జిందాల్ ప్లాంట్ పనుల ఆలస్యంపై పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్లాంట్ ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించగా రాబోయే నవంబరు నాటికి కాకినాడ ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని జిందాల్ ప్రతినిధులు ఉపముఖ్యమంత్రికి స్పష్టమైన హామీ ఇచ్చారు.

Pawan Kalyan: కాలుష్య నియంత్రణే ముఖ్యం.. నివేదిక ఇవ్వాలని పవన్ ఆదేశం!

కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇటువంటి వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ల వల్ల స్థానికంగా కాలుష్యం ఏ మేరకు పెరుగుతోంది? దాన్ని అదుపు చేయడానికి యాజమాన్యం తీసుకుంటున్న రక్షణ చర్యలు ఏమిటి? అనే అంశాలపై ఒక సమగ్ర నివేదికను తనకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై జిందాల్ ప్రతినిధులు స్పందిస్తూ.. కాలుష్య నియంత్రణ మండలి (PCB) ఏడాదికి నాలుగుసార్లు తమ ప్లాంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలు ఇస్తోందని, నిబంధనల ప్రకారమే ప్లాంట్ నడుస్తోందని పవన్ కల్యాణ్‌కు వివరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

విశాఖ ఉక్కులో 'టిఒఎంసి' విధానం: ప్రైవేటీకరణ దిశగా అడుగులు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha