Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమలకు రూ.1.13 కోట్ల ఎలక్ట్రిక్ బస్సు విరాళం

తిరుమలకు రూ.1.13 కోట్ల ఎలక్ట్రిక్ బస్సు విరాళం

వార్త 2 weeks ago

Tirumala Donation: తిరుమలను సంపూర్ణ కాలుష్య రహిత పుణ్యక్షేత్రంగా మార్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం శరవేగంగా అడుగులు వేస్తోంది. భక్తులు, దాతల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది.

ఇందులో భాగంగానే ప్రముఖ దాత నీరా రాడియా శ్రీవారి భక్తుల సేవా సౌకర్యార్థం టీటీడీకి రూ.1.13 కోట్ల విలువైన అత్యాధునిక విద్యుత్ (ఎలక్ట్రిక్) బస్సును విరాళంగా అందజేశారు.

Read Also: TG Police Jobs : పెద్ద ఎత్తున పోలీస్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ కసరత్తు ?

Electric bus donation of Rs 1.13 crore to Tirumala

Tirumala Donation: బస్సుతో పాటు రూ.20 లక్షల విలువైన 15 ట్యాబ్‌లు

నీరా రాడియా కేవలం ఎలక్ట్రిక్ బస్సును మాత్రమే కాకుండా, భక్తుల డిజిటల్ సేవల కోసం సుమారు రూ.20 లక్షల విలువైన 15 అత్యాధునిక ట్యాబ్‌లను కూడా టీటీడీకి బహూకరించారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఈ నూతన ఎలక్ట్రిక్ బస్సుకు అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం దాత నీరా రాడియా ఈ బస్సు తాళాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. స్వామివారిపై భక్తితో ఇంతటి గొప్ప దాతృత్వాన్ని చాటుకున్న నీరా రాడియాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

త్వరలోనే 100% గ్రీన్ వెహికల్స్

ఈ సరికొత్త ఎలక్ట్రిక్ బస్సును తిరుమలలోని స్థానిక భక్తుల ఉచిత రవాణా కోసం నడుపుతున్న ‘ధర్మరథం’ సర్వీసుల విభాగంలో చేర్చనున్నారు. తిరుమలకు వచ్చే సాధారణ భక్తులకు కొండపై ఒకచోట నుండి మరోచోటికి వెళ్ళడానికి ఈ ధర్మరథం బస్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం తిరుమలలో భక్తుల కోసం మొత్తం 20 ధర్మరథం బస్సులు నడుస్తుండగా, వాటిలో ఇప్పటికే 14 బస్సులు విద్యుత్ వాహనాలే కావడం విశేషం. ఈ బస్సులు కొండపై ఉన్న 21 బస్ స్టాప్‌ల మీదుగా రోజుకు సుమారు 380 ట్రిప్పులు తిరుగుతూ భక్తులకు నిరంతరాయంగా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. త్వరలోనే తిరుమలలో మిగిలి ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో కూడా పూర్తిగా సరికొత్త విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడమే తమ ప్రధాన లక్ష్యమని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు. నీరా రాడియా అందించిన ఈ భారీ విరాళం, తిరుమలను పూర్తిగా పర్యావరణ అనుకూల క్షేత్రంగా మార్చాలనే టీటీడీ సంకల్పానికి మరింత ఊతమివ్వనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

విశాఖ ఉక్కులో 'టిఒఎంసి' విధానం: ప్రైవేటీకరణ దిశగా అడుగులు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha