Kamareddy Road Accident: కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్‌గల్ (జుక్కల్) సమీపంలోని జాతీయ రహదారి 161పై విషాదకర సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ డిపోకు చెందిన తెలంగాణ ఆర్టీసీ బస్సు జుక్కల్ చౌరస్తా వద్ద అదుపుతప్పి బోల్తా పడిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఆంజనేయులు (50) తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి బిచ్‌కుందకు ప్రయాణికులతో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Read Also:Jharkhand Koderma Crime: కన్న కూతురిపైనే తండ్రి అఘాయిత్యం

Kamareddy Road Accident: క్షతగాత్రులకు చికిత్స & ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
ప్రమాదం జరగగానే స్థానికులు వెంటనే స్పందించి బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి, పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన 15 మంది ప్రయాణికులను ప్రథమ చికిత్స కోసం బిచ్‌కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన డ్రైవర్ ఆంజనేయులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ విట్టల్ రెడ్డి, సీఐ రవికుమార్, ఎస్సై మురళి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. బస్సు అదుపుతప్పడానికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Epaper: epaper.vaartha.com
సంగారెడ్డి తార కాలేజీలో కలకలం.. విద్యార్థినిపై దాడి చేసి ఫోన్ చోరీ!

