Telangana School Bandh: రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 23న (మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు బంద్‌కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి, బంద్ వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అటకెక్కిందని, సీఎం రేవంత్‌రెడ్డి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల మాఫీయాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో 23 వేల ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేతకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల విచ్చలవిడి ఫీజు దోపిడీకి ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరిచిందన్నారు. ప్రభుత్వ స్కూళ్లు ప్రారంభమైనా.. ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫామ్స్ అందలేదని చెప్పారు.
Statewide school shutdown on June 23
Telangana School Bandh: 23 వేల ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేతకు కుట్ర?
రాష్ట్రంలో దాదాపు 23 వేల ప్రభుత్వ పాఠశాలలను ఎత్తివేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాంబాబు ఆరోపించారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతూ సామాన్యులను దోచుకుంటుంటే, ప్రభుత్వం వారికి రెడ్‌కార్పెట్ పరిచి ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఒకపక్క ప్రైవేట్ స్కూళ్లు ఫీజుల బాదుడు కొనసాగిస్తుంటే.. మరోపక్క ప్రభుత్వ స్కూళ్లు ప్రారంభమై రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ పేద విద్యార్థులకు కనీసం యూనిఫామ్స్ కూడా అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూన్ 23న చేపట్టే రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించి విజయవంతం చేయాలని ఏబీవీపీ కోరింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
బాలుడు నిరంజన్‌కు రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేసిన బండ్ల గణేష్!

