Siddaramaiah : కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి (CM) పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన సీనియర్ నేత సిద్ధరామయ్య, తెరవెనుక ఒక భారీ వ్యూహానికి తెరలేపినట్లు పొలిటికల్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
పదవి నుంచి తప్పుకున్నా.. రాష్ట్ర రాజకీయాల్లో తన పట్టు కోల్పోకుండా ఉండేందుకు ఆయన ఒక కొత్త మెలిక పెట్టారు. కాబోయే ముఖ్యమంత్రిగా భావిస్తున్న డీకే శివకుమార్ ప్రభుత్వంలో ఒంటెద్దు పోకడలు పోకుండా, పూర్తి చక్రం తిప్పకుండా ఉండేలా సిద్ధరామయ్య హైకమాండ్ ముందు కొన్ని కీలక ప్రతిపాదనలు ఉంచినట్లు సమాచారం. అందులో భాగంగా, పార్టీకి మరియు ప్రభుత్వానికి మధ్య సమన్వయం కుదిర్చే “కోఆర్డినేషన్ కమిటీ” బాధ్యతలను లేదా కీలక పదవిని తనకు అప్పగించాలని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలుస్తోంది. దీని ద్వారా ప్రభుత్వ నిర్ణయాల్లో తన ప్రమేయం నిరంతరం ఉండేలా ఆయన ప్లాన్ చేశారు.
Read Also :
కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లు!
కొడుకు కోసం డిప్యూటీ సీఎం పదవి
కేవలం పాలనపై పట్టు సాధించడమే కాకుండా, తన రాజకీయ వారసత్వాన్ని, తన వర్గం ప్రాధాన్యతను కాపాడుకునేందుకు సిద్ధరామయ్య గట్టి పట్టుబడుతున్నారు. తన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు రాబోయే కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి (Dy.CM) పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినట్లు టాక్ నడుస్తోంది. దీంతో పాటు తన నమ్మకస్థులైన, తన వర్గానికి చెందిన కీలక ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించాలని అధిష్ఠానం ముందు గట్టిగా ప్రతిపాదించారట. ఒకవేళ డీకే శివకుమార్ సీఎం అయితే, తన వర్గాన్ని అణగదొక్కకుండా ఉండేందుకే సిద్ధరామయ్య ఈ ముందస్తు ప్లాన్ వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. పదవి పోయినా కర్ణాటక కాంగ్రెస్‌లో తానే ‘కింగ్ మేకర్’ అని నిరూపించుకునేలా సిద్ధరామయ్య వేస్తున్న ఈ అడుగులు ఇప్పుడు ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పెద్దలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

