Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూన్14న హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన

జూన్14న హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన

వార్త 2 months ago

Cockroach Janata Party : దేశ రాజకీయాల్లో మరియు సామాజిక ఉద్యమాల్లో సరికొత్త పంథాతో దూసుకుపోతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) తమ నిరసన సెగను భాగ్యనగరానికి విస్తరించనుంది.

మహారాష్ట్రలోని పుణే నగరంలో ఈ పార్టీ చేపట్టిన వినూత్న నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. విలక్షణ శైలిలో క్రికెట్ జెర్సీ ధరించి ఈ ప్రదర్శనలో పాల్గొన్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు దీప్కే యువతకు, ముఖ్యంగా విద్యార్థి లోకానికి ఒక కీలక పిలుపునిచ్చారు. ప్రస్తుత రోజుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం సాగుతున్న ‘హిందూ-ముస్లిం’ మత రాజకీయాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, విద్యావంతులు ఇలాంటి విభజన రాజకీయాల్లో పాల్గొని తమ భవిష్యత్తును పాడుచేసుకోవద్దని ఆయన హితవు పలికారు. పుణే విజయవంతం కావడంతో, ఈ నిరసనల సిరీస్‌లో భాగంగా జూన్ 14న హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.

Read Also : తనపై ఉన్న కేసులు మీనాక్షికి తెలియవా: అర్వింద్

 Cockroach Janata Party

అండగా నిలిచిన సోనమ్ వాంగ్చుక్.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్!

ఈ వినూత్న ఉద్యమానికి ప్రముఖ లద్దాఖ్ సామాజిక ఐకాన్, యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్చుక్ మద్దతు తెలపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పుణే నిరసనల్లో నేరుగా పాల్గొన్న ఆయన.. విద్యారంగంలో జరుగుతున్న లోపాలు, పరీక్షల వివాదాలను ప్రస్తావిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఈ సిరీస్ షెడ్యూల్‌ను CJP విడుదల చేసింది. దీని ప్రకారం జూన్ 12న లక్నో, జూన్ 13న అమృత్‌సర్, జూన్ 14న హైదరాబాద్, జూన్ 15న జైపూర్ నగరాల్లో నిరసనలు జరగనున్నాయి. ఇక ఈ సుదీర్ఘ పోరాటాన్ని జూన్ 20న దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ ప్రదర్శనతో ముగించనున్నారు. విద్యార్థుల హక్కులు, ఉపాధి, మరియు దేశ సమగ్రత కోసం సాగుతున్న ఈ విచిత్ర నిరసనలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు కొత్త భవనాలు: మంత్రి పొంగులేటి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha