Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల బుకింగ్‌లో అక్రమాలు.. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీతో వెబ్‌సైట్ హైజాక్

శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల బుకింగ్‌లో అక్రమాలు.. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీతో వెబ్‌సైట్ హైజాక్

వార్త 1 week ago

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎంతో ఆశగా ఎదురుచూసే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల బుకింగ్‌లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణ భక్తుల కంటే వేగంగా టికెట్లు పొందేందుకు కొన్ని ప్రైవేట్ నెట్ సెంటర్లు, ట్రావెల్ ఏజెంట్లు 'ఆటో ఫిల్లింగ్' వంటి థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్లను ఉపయోగిస్తున్నారు.

ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో జారీ చేసే 800 టికెట్లలో 400 నుండి 500 టికెట్లను క్షణాల వ్యవధిలోనే చేజిక్కించుకుంటున్నారు. సర్వర్ ఎనేబుల్ అయిన వెంటనే, ముందే సిద్ధం చేసుకున్న భక్తుల వివరాలను సాఫ్ట్‌వేర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లోకి పంపి, సామాన్యులకు అవకాశం లేకుండా చేస్తున్నారు.

Read Also: AP High Court Chief Justice Lisa Gill: ఏపీ హైకోర్టు సీజేకు 'జడ్ ప్లస్' భద్రత!

 Software scam in Srivari ticket booking!

Tirumala: భక్తుల జేబులకు చిల్లు.. ఏజెంట్ల దోపిడీ

వాస్తవానికి శ్రీవాణి ట్రస్ట్ టికెట్ ధర రూ. 10,500 (విరాళం + దర్శనం రుసుము) ఉండగా, అక్రమార్కులు దీనిని ఒక్కో టికెట్‌పై రూ. 3,000 వరకు అదనంగా వసూలు చేస్తూ, రూ. 13,500కు విక్రయిస్తున్నారు. భక్తుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని సాగుతున్న ఈ దోపిడీతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం లాభాపేక్షతోనే అత్యాధునిక టెక్నాలజీని వాడుతూ అధికారిక వెబ్‌సైట్ వ్యవస్థనే వీరు హైజాక్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

రంగంలోకి విజిలెన్స్.. చెన్నై ఏజెన్సీపై కేసు

ఈ అక్రమాలపై అందిన ఫిర్యాదులతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా చెన్నైకి చెందిన ‘పద్మావతి ట్రావెల్స్’ అనే సంస్థ శ్రీవాణి టికెట్ల విక్రయాల్లో భారీ అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. సదరు సంస్థపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఈ దందాలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? సాంకేతిక సహకారం ఎక్కడి నుండి అందుతోంది? అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha