Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజ్యసభ అభ్యర్థులు వీరేనా?

రాజ్యసభ అభ్యర్థులు వీరేనా?

వార్త 2 months ago

TDP Rajya Sabha Candidate: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (TDP)లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముమ్మరంగా సాగుతోంది.

టీడీపి కోటాలో లభించే మూడు రాజ్యసభ స్థానాల కోసం ప్రధానంగా నలుగురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబుకు మరోసారి పెద్దల సభకు వెళ్లేందుకు అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు విద్యావేత్త, పార్టీకి అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్న భాష్యం రామకృష్ణను కూడా ఈసారి రాజ్యసభకు పంపాలని పార్టీ నాయకత్వం దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సుదీర్ఘ కాలంగా పార్టీకి అండగా నిలిచిన నేతలకు, సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ ఈ ఎంపికలు జరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also : జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్

మూడో స్థానం కోసం హోరాహోరీ.. వర్ల రామయ్య వర్సెస్ చింతకాయల విజయ్

ఇక ఉత్కంఠ రేపుతున్న మూడో రాజ్యసభ స్థానం కోసం ఇద్దరు కీలక నేతల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. టీడీపీ సీనియర్ నాయకుడు, పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించే వర్ల రామయ్య పేరు ఒకవైపు పరిశీలనలో ఉండగా.. మరోవైపు ప్రస్తుత శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు, యువ నేత చింతకాయల విజయ్ పేరును కూడా అధిష్ఠానం తీవ్రంగా పరిశీలిస్తోంది. సీనియారిటీ, విధేయత కోటాలో వర్ల రామయ్యకు అవకాశం ఇస్తారా, లేక ఉత్తరాంధ్ర సమీకరణాలు, యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూ విజయ్ వైపు మొగ్గు చూపుతారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఈ ముగ్గురు అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే అధికారికంగా స్పష్టత ఇవ్వనున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

లింగమనేని రమేశ్ కు రాజ్యసభ సీట్ ఇవ్వడంపై జనసైనికుల అసంతృప్తి !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha