Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాళేశ్వరం బ్యారేజీలకు రూ.2,500 కోట్లు!

కాళేశ్వరం బ్యారేజీలకు రూ.2,500 కోట్లు!

వార్త 1 week ago

Kaleshwaram Project Repairs:కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో తలెత్తిన సాంకేతిక లోపాలను శాశ్వతంగా తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.

ఈ ప్రతిష్టాత్మక బ్యారేజీల బాగుకోసం సుమారు రూ.2,500 కోట్లు ఖర్చు చేయాలని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రాజెక్టు వద్ద నిర్వహించిన రకరకాల భూగర్భ అధ్యయనాలు, నిపుణుల సాంకేతిక పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాల ఆధారంగా పునరుద్ధరణ డిజైన్లకు తుదిరూపు ఇచ్చే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆమోదిత డిజైన్లను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక కమిటీ ముందుకు ఉంచనుంది. సీడబ్ల్యూసీ నుంచి అనుమతి రాగానే వచ్చే నెలలోనే క్షేత్రస్థాయి పనులు ప్రారంభించనున్నారు.

Read also: Chicken prices: మాంసం ప్రియులకు పెద్ద షాక్

 Rs 2,500 crore for Kaleshwaram barrages!

మేడిగడ్డ 7వ బ్లాక్ లో ఏం జరగబోతోంది? నిపుణుల సంచలన ప్రత్యామ్నాయాలు!

బ్యారేజీల భద్రత పెంచేందుకు దెబ్బతిన్న భాగాల పటిష్ఠతతో పాటు కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, స్టిల్లింగ్ బేసిన్ల విస్తరణ చేయనున్నారు. నిపుణుల బృందం ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ పునరుద్ధరణపై ప్రత్యేక అధ్యయనం చేస్తోంది. దెబ్బతిన్న ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించడం ఒక ఆలోచనగా ఉంది. లేదా దెబ్బతిన్న పియర్లను తీసేసి గేట్లు లేకుండా రాఫ్ట్‌ను పైవరకు పెంచే మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నారు. నిర్మాణ భద్రత, వ్యయం, సాంకేతిక సాధ్యాసాధ్యాల ఆధారంగా ఈ రెండింటిలో ఉత్తమ విధానాన్ని ఎంపిక చేయనున్నారు.

Kaleshwaram Project Repairs:రాబోయే వర్షాకాలంలో నీటిని నిల్వ చేయగలరా? కేబినెట్ అప్రూవల్ ఎప్పుడు?

సీడబ్ల్యూసీ సాంకేతిక కమిటీ పరిశీలన పూర్తయిన తర్వాత ప్రతిపాదనలు నేరుగా రాష్ట్ర కేబినెట్ ముందుకు వెళ్తాయి. డిజైన్ల అంశం కొలిక్కి రాగానే మంత్రిమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం అనుమతుల ప్రక్రియను అక్టోబర్‌లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. వచ్చే నెలలో మరమ్మతు పనులు ప్రారంభించి, రాబోయే వర్షాకాలం నాటికి పనులను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. స్టిల్లింగ్ బేసిన్ విస్తరణ, ఇతర ముందస్తు రక్షణ చర్యల ద్వారా బ్యారేజీలను మళ్లీ పూర్వవైభవానికి తీసుకురానున్నారు.

Epaper: epaper.vaartha.com

మండుతున్న ఎండలు.. ఎల్లో అలర్ట్ జారీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha