Telangana weather update:తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే అక్టోబరు నెలలోనే భానుడు భగభగ మండిపోతున్నాడు. పగటిపూట తీవ్రమైన ఎండల కారణంగా బయటకు రావడానికి జనాలు భయపడుతున్నారు.
రాత్రి వేళల్లో కూడా ఉక్కపోత విపరీతంగా పెరగడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ వాతావరణంలో సమాచారం ప్రకారం వేడి తీవ్రత రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది.
El Nino Effect: వచ్చేది మరో ఎండాకాలం - ఐఎండీ వార్నింగ్!
Scorching heat… Yellow alert issued.
బాబోయ్ తేమ శాతం ఎందుకు అంతలా పడిపోయింది?
సాధారణంగా ఈ సమయంలో గాలిలో తేమ 60 నుంచి 70 శాతం మధ్య ఉండాలి. కానీ ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఈ తేమ ఏకంగా 50 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. గాలిలో తేమ అంతలా పడిపోవడమే ఈ తీవ్రమైన వేడి, విపరీతమైన ఉక్కపోతకు ప్రధాన కారణం. ఈ మార్పు వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
Telangana weather update:రానున్న 3 రోజులు ఆ 17 జిల్లాల పరిస్థితి ఏమిటి?
రాబోయే 3 రోజుల్లో సాధారణం కంటే భయంకరమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. పెద్దపల్లి, ఖమ్మం, మంచిర్యాల, నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్, మేడ్చల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, జగిత్యాల, వనపర్తి, మహబూబ్‌నగర్ అనే 17 జిల్లాల ప్రజలను వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది. ఈ ప్రాంతాలకు అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
Epaper: epaper.vaartha.com

