Malshej Ghat Waterfall Accident: మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మల్షేజ్ ఘాట్ సమీపంలోని 'కాలు జలపాతం' (Kalu Waterfall) వద్ద ఒక దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది.
వర్షాకాలంలో జలపాతం అందాలను ఆస్వాదించేందుకు వచ్చిన ఒక యువకుడు, సెల్ఫీ తీసుకునే క్రమంలో కాలు జారి వేగంగా ప్రవహిస్తున్న నీటితో పాటు లోయలోకి దొర్లుకుంటూ వెళ్లిపోయాడు.
యువకుడు కాలు జారి ఘాట్ లోయలో పడిపోతుండగా, చివరి క్షణంలో అక్కడ ఉన్న ఒక పెద్ద రాయి అతని చేతికి చిక్కింది. ఏమాత్రం పట్టు సడలినా వందల అడుగుల లోయలో వేగవంతమైన ప్రవాహంలో కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. ఆ క్లిష్ట సమయంలో సదరు యువకుడు ఆ రాయిని గట్టిగా పట్టుకుని సహాయం కోసం ఆర్తనాదాలు చేశాడు.
Read Also : Kia India August Offers: ఆగస్టు ఆఫర్లు.. కియా కార్లపై భారీ డిస్కౌంట్లు!
A young man slipped and was about to fall into a valley… what happened in the end?
Malshej Ghat Waterfall Accident: సమయస్ఫూర్తితో చీరలతో తాడు చేసి..
అక్కడ ఉన్న పర్యాటకులు తక్షణమే స్పందించి అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. తాడు, ఇతర రక్షణ పరికరాలు అందుబాటులో లేకపోవడంతో, వెంటనే తమ వద్ద ఉన్న చీరలు, దుస్తులను ఒకదానికొకటి ముడులు వేసి పొడవైన తాడులా తయారు చేశారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా లోయ అంచు వరకు వెళ్ళి, ఆ బట్టల తాడును కిందకు విసిరి యువకుడిని సురక్షితంగా పైకి లాగి ప్రాణాపాయం నుంచి కాపాడారు.
దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పర్యాటకుల సమయస్ఫూర్తి, ధైర్యాన్ని నెటిజన్లు విశేషంగా ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా లైక్స్, పిక్చర్స్ కోసం జలపాతాలు, కొండచరియల వద్ద ప్రాణాలను పణంగా పెట్టవద్దని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

