Vinod Kambli: వినోద్ కాంబ్లీ నటించిన కొత్త ఐస్‌క్రీమ్ యాడ్ పెద్ద చర్చకు దారితీసింది. అనారోగ్య సమస్యల తర్వాత కాంబ్లీ మళ్లీ తెరపైకి రావడం ఒక ఎత్తైతే, ఆ యాడ్ వెనుక ఉన్న సందేశం, దానిపై వస్తున్న విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
Read Also:Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డు బద్ధలు కావాల్సిందే.. వైభవ్ సిక్సర్ల విధ్వంసం
యాడ్ కథాంశం
చాలా కాలం తర్వాత పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చిన కాంబ్లీ, డిన్‌షాస్ ఐస్‌క్రీమ్ కోసం చేసిన ఈ క్యాంపెయిన్‌లో ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చారు.”జీవితంలో కాస్త తక్కువ పొందిన వారు, కొంచెం ఎక్కువ పొందేందుకు అర్హులు” అనే థీమ్‌తో ఈ యాడ్ తీశారు. దీనికి ప్రతీకగా ఐస్‌క్రీమ్ కోన్‌పై చాక్లెట్ భాగాన్ని పెద్దదిగా చూపించారు. కాంబ్లీ పునరాగమనానికి, ఆయన స్థైర్యానికి నివాళిగా ఈ యాడ్‌ను ప్రచారం చేశారు.
Vinod Kambli: పాజిటివ్ క్యాంపెయిన్
నాస్టాల్జిక్ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో, కాంబ్లీ జీవితంలోని సంఘర్షణలను సూచిస్తూ, చివర్లో ఎక్కువ చాక్లెట్ ఉన్న ఐస్‌క్రీమ్ కోన్ ఇచ్చి సంతోషం కలిగించడం ద్వారా “దిల్‌దారీ” అని చెప్పారు. ఏజెన్సీ వైపు నుంచి ఇది కాంబ్లీ రెసిలియన్స్‌ను హైలైట్ చేసే పాజిటివ్ క్యాంపెయిన్ అని వ్యాఖ్యానించారు. కానీ చాలామంది దీనిని “సానుభూతి వ్యాపారం”గా చూస్తున్నారు. కాంబ్లీ అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలను ఉపయోగించి ఐస్‌క్రీమ్ అమ్మడం సరైనదా అని ప్రశ్నిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

