Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీలంక క్రికెట్‌పై మళ్లీ ఐసీసీ వేటు పడనుందా?

శ్రీలంక క్రికెట్‌పై మళ్లీ ఐసీసీ వేటు పడనుందా?

వార్త 1 month ago

Sri Lanka Cricket Board Crisis: శ్రీలంక క్రికెట్ బోర్డులో నెలకొన్న రాజకీయ ప్రకంపనలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. వరుస వైఫల్యాలు, అంతర్గత విభేదాల నేపథ్యంలో బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

Read Also:Riyan Parag Vaping Controversy: డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేస్తూ కెమెరాకు దొరికిన రియాన్ పరాగ్

ముగిసిన షమ్మీ సిల్వా శకం

శ్రీలంక క్రికెట్ (SLC) చరిత్రలో అత్యంత వివాదాస్పద మరియు సుదీర్ఘమైన పాలనల్లో ఒకటి ముగిసింది.అధ్యక్షుడు షమ్మీ సిల్వాతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులంతా తమ పదవులను త్యజించారు. తమ రాజీనామా లేఖలను అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేకు సమర్పించారు.భారత్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన 2026 టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు కనీసం సూపర్-8 దశకు కూడా చేరుకోలేకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

 Shammi Silva Resignation Reasons

Sri Lanka Cricket Board Crisis?: వివాదాల బోర్డు.. ఐసీసీ హెచ్చరికలు

షమ్మీ సిల్వా హయాంలో శ్రీలంక క్రికెట్ అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంది.2023లో బోర్డులో ప్రభుత్వ జోక్యం పెరిగిందన్న కారణంతో ఐసీసీ శ్రీలంక సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీనివల్ల అండర్-19 ప్రపంచకప్ ఆతిథ్యాన్ని కూడా శ్రీలంక కోల్పోయింది.ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టిన సిల్వా, స్వదేశంలో మాత్రం విమర్శల పాలయ్యారు. 1973 క్రీడా చట్టం,ఐసీసీ నిబంధనల మధ్య నలిగిపోతున్న శ్రీలంక క్రికెట్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

పొలార్డ్ రికార్డు బద్ధలు కావాల్సిందే.. వైభవ్ సిక్సర్ల విధ్వంసం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha