Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పొలార్డ్ రికార్డు బద్ధలు కావాల్సిందే.. వైభవ్ సిక్సర్ల విధ్వంసం

పొలార్డ్ రికార్డు బద్ధలు కావాల్సిందే.. వైభవ్ సిక్సర్ల విధ్వంసం

వార్త 1 month ago

Vaibhav Sooryavanshi: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ ఆటగాళ్ల రికార్డులను సవాల్ చేస్తూ, టీ20 ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు.

Read Also:IPL 2026: నేడు SRHతో ముంబై తో తాడోపేడో !!

ముల్లాన్‌పూర్‌లో వైభవ్ సునామీ

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో వైభవ్ తన పవర్‌ హిట్టింగ్‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు:223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఏమాత్రం తడబడకుండా, కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులు బాదాడు. ఇందులో 5 భారీ సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి.ఈ 5 సిక్సర్లతో వైభవ్ తన టీ20 కెరీర్‌లో మొత్తం 99 సిక్సర్లకు చేరుకున్నాడు. కేవలం 27 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం.టి20 క్రికెట్‌లో అత్యంత తక్కువ బంతుల్లో 100 సిక్సర్లు బాదిన రికార్డు ప్రస్తుతం వెస్టిండీస్ లెజెండ్ కీరన్ పొలార్డ్ పేరిట ఉంది.

 Vaibhav Sooryavanshi Record

Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డు గాలిలో దీపమేనా?

పొలార్డ్ 843 బంతుల్లో ఈ ఘనత సాధించగా, వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు కేవలం 511 బంతుల్లోనే 99 సిక్సర్లు పూర్తి చేశాడు. అంటే పొలార్డ్ కంటే దాదాపు 300 బంతులు తక్కువ ఆడినా, ఒక్క సిక్సర్ కొడితే వైభవ్ సరికొత్త ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. మే 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఈ అద్భుతం జరిగే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేస్తూ కెమెరాకు దొరికిన రియాన్ పరాగ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha