Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కామెడీకి గుడ్ బై చెప్పనున్న తరుణ్ భాస్కర్?

కామెడీకి గుడ్ బై చెప్పనున్న తరుణ్ భాస్కర్?

వార్త 2 months ago

Tharun Bhaskar: టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన 'గాయపడ్డ సింహం' చిత్రం విడుదలకు సిద్ధమైంది. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 1, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తుండటంతో సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ హైప్ నెలకొంది.

Read Also:Chandrababu Birthday: AP CM చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన ప్రముఖులు

సినిమా కథాంశం

'అమెరికన్ డ్రీమ్' (అమెరికా వెళ్లాలనే కల) చుట్టూ తిరిగే ఒక యువకుడి జీవిత ప్రయాణమే ఈ సినిమా.ఇది ఒక క్రైమ్ కామెడీ డ్రామా.తరుణ్ సరసన ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. హర్షవర్ధన్, విష్ణు ఓయ్, సుభలేఖ సుధాకర్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.'నవ్వకండి.. ఇది చాలా సీరియస్ మేటర్' అనే ట్యాగ్‌లైన్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.

 Tharun Bhaskar Serious Drama Comments

Tharun Bhaskar: తరుణ్ భాస్కర్ షాకింగ్ వ్యాఖ్యలు

సినిమా ప్రమోషన్ల కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్ తన కెరీర్ ప్లానింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.”ఇప్పటివరకు నేను ఎక్కువగా కామెడీ చిత్రాలే చేశాను. కానీ ఇకపై నా శైలి మార్చుకోవాలనుకుంటున్నాను. వచ్చే రెండేళ్లలో కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తి చేసి, ఆ తర్వాత కామెడీ జోనర్‌కు విరామం ఇస్తాను. సందీప్ రెడ్డి వంగా, ఆదిత్య ధర్ వంటి దర్శకుల తరహాలో బలమైన ఎమోషన్స్ ఉన్న సీరియస్ డ్రామా చిత్రాలను తెరకెక్కించడమే నా తదుపరి లక్ష్యం.”అని ఆయన పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

పూనకాలు గ్యారెంటీ.. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి-అనిల్ కపూర్?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha