Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పూనకాలు గ్యారెంటీ.. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి-అనిల్ కపూర్?

పూనకాలు గ్యారెంటీ.. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి-అనిల్ కపూర్?

వార్త 2 months ago

Mega Star 158 Update: మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న #Mega158 ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరూ మళ్లీ జతకడుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ అప్‌డేట్స్ అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి.ఈ చిత్రానికి 'కాకాజీ' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

Read Also: Vijay Divorce: నేడే విజయ్ - సంగీత విడాకుల కేసు విచారణ.. విడిపోయేందుకే ఇద్దరూ మొగ్గు?

Mega Star 158 Update: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు దిగ్గజాలు

ఈ సినిమా గురించి వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన వార్త ఏంటంటే.. బాలీవుడ్ వెటరన్ స్టార్ అనిల్ కపూర్ ఇందులో ఒక కీలక పాత్ర పోషించబోతున్నారట. చిరంజీవి, అనిల్ కపూర్ మధ్య వచ్చే సన్నివేశాలు హై వోల్టేజ్ యాక్షన్‌తో పాటు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 Anil Kapoor in Chiranjeevi Movie

చిరు సరికొత్త గ్యాంగ్‌స్టర్ లుక్‌లో, తన మార్క్ డైలాగ్ డెలివరీతో మెప్పించబోతున్నారు.దర్శకుడు బాబీ సిద్ధం చేసిన స్క్రిప్ట్‌పై మెగాస్టార్ పూర్తి విశ్వాసంతో ఉన్నారని, అందుకే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. మెగా మాస్ ఎలిమెంట్స్‌తో పాటు గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథ టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AP CM చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన ప్రముఖులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha