Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంగ్రెస్ నేత జావీద్ దుర్మరణం

కాంగ్రెస్ నేత జావీద్ దుర్మరణం

వార్త 2 months ago

సూర్యాపేటలో ఘోర ప్రమాదం

Congress Leader : సూర్యాపేట జిల్లాలో ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లలమర్రి శివారులో జరిగిన ఈ ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ జావీద్ అక్కడికక్కడే మృతి చెందారు.

డివైడర్‌ను ఢీకొన్న కారు

ప్రాథమిక సమాచారం ప్రకారం జావీద్ ప్రయాణిస్తున్న కారు అతివేగంతో వెళ్తుండగా నియంత్రణ కోల్పోయింది. దీంతో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జావీద్ తీవ్ర గాయాలపాలై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

పోలీసులు దర్యాప్తు

సమాచారం అందుకున్న సూర్యాపేట రూరల్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

భట్టి విక్రమార్క దిగ్బ్రాంతి

కాంగ్రెస్ నేత జావీద్ మృతి పట్ల తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.

Read Also: Mission Bhagiratha: ఇశ్రీతాబాద్‌లో ఘనంగా 'జల మహోత్సవం'

 Congress Leader

కాంగ్రెస్‌కు కీలక నేత

గత పది సంవత్సరాలుగా పార్టీ కష్టకాలంలో ముందుండి జావీద్ సేవలందించారని ఆయన గుర్తు చేసుకున్నారు. జావీద్ ఖమ్మం నగర కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం పీసీసీ కార్యవర్గ సభ్యుడిగా, రాజీవ్ గాంధీ పంచాయతీ అభియాన్ కమిటీలో కీలక నేతగా, సేవాదళ్ రాష్ట్ర నాయకుడిగా పని చేశారు.

కుటుంబానికి అండగా కాంగ్రెస్

జావీద్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ప్రోటోకాల్ పై రగడ..ఇందిరమ్మ ఇళ్ల పత్రాల సమావేశంలో రసాభాస

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha