Indiramma Indlu Meeting Protocol Issue :స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు, జిల్లా సర్పంచుల పోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణ గౌడ్ మధ్యల ప్రోటోకాల్ పై రగడ జరిగింది.
బుధవారం నాడు కౌడిపల్లి రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే కోటా కింద మంజూరైన ఇందిరమైండ్ల పత్రాల పంపిణీ సమావేశానికి స్థానిక ఎంపీడీవో అధ్యక్షత వహిస్తూ జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ ని వేదిక నల్లంకరించాలని ప్రసంగించగానే బి ఆర్ ఎస్ నాయకులు మిగతా సర్పంచ్ వేదిక పైకి పిలవాలంటూ నినాదాలు చేశారు. దీంతో స్థానిక సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ బీఆర్ఎస్ నాయకుడు దుర్గా రెడ్డి మధ్య మాటల యుద్ధం మొదలైంది.
Read Also: Mission Bhagiratha: ఇశ్రీతాబాద్‌లో ఘనంగా 'జల మహోత్సవం'
Indiramma Indlu Meeting Protocol Issue: సర్పంచ్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకులు
స్థానిక సర్పంచికి సమాచారం ఇవ్వకుండా హుటాహుటిన ప్రభుత్వ కర్యక్రమాలు ఎలానిర్వహిస్తారని కృష్ణా గౌడ్ మండిపాటు. ఒక్కసారిగా వేడెక్కిన సమావేశం. ఇరు వర్గాల వాదనలతో సభ ప్రాంగణం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి కలగజేసుకొని ఇరువర్గాలను శాంతింప చేసింది.ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు కౌడిపల్లి గ్రామానికి చెందిన దుర్గా రెడ్డి,సర్పంచ్ కృష్ణ గౌడ్ ని వేదిక పైకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించగా నీవు ఏ ప్రోటోకాల్ ప్రకారం ఏ హోదాలో అడుగుతున్నావని దుర్గారెడ్డిని సర్పంచ్ కృష్ణ గౌడ్ గట్టిగా నిలదీశారు.
దీంతో ఒక్కసారిగా రైతు వేదిక రస బసాగా మారింది.స్థానిక సర్పంచికి ప్రోగ్రాం గురించి ఆలస్యంగా సమాచారం అందించడం సరికాదన్నారు ఇరు వర్గాల వాదనలతో రైతు వేదిక దద్దరిల్లింది స్థానిక ఎమ్మెల్యే సునీత రెడ్డి కలగజేసుకొని ఇరువురిని శాంతింప చేసింది ఇవి రాజకీయ సమావేశం కాదని సభా సాంప్రదాయాలను అందరూ గౌరవించాలని సూచించారు.
ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి ప్రోటోకాల్ ఉంటుందని అది అందరూ పాటించాలని అన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే ఆయా గ్రామాల సర్పంచుల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ డిఎల్ పి ఓ సాయి బాబా హౌసింగ్ డిఇ ప్రభు ఏఈ అభిషేక్ ఎస్సై అమర్ ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు నాయకులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

