Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బిఆర్ఎస్ పార్టీలో ముదిరాజ్ సంఘం నాయకుల భారీ చేరిక

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బిఆర్ఎస్ పార్టీలో ముదిరాజ్ సంఘం నాయకుల భారీ చేరిక

వార్త 1 month ago

Ramayampet BRS Joinings: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకులతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

మంగళవారం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.

Read Also : Hyderabad Crime: హైదరాబాద్‌లో అమానుషం.. వీధి కుక్కల రక్తంతో అక్రమ వ్యాపారం

బిఆర్ఎస్ లో చేరిన ముఖ్య నాయకులు

మహంకాళి టెంపుల్ డైరెక్టర్, మాజీ వార్డు సభ్యుడు, రామాయంపేట ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గుడాల లింగం, సంఘం సలహాదారులు రెడ్డమైన నరేష్, నాయకులు పోచమ్మల కిషన్, దేవుని సర్వయ్య, రొయ్యల కిషన్ సహా సుమారు 50 మంది ముదిరాజ్ సంఘం నాయకులు, సభ్యులు గులాబీ కండువా కప్పుకున్నారు. హరీష్ రావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి, పార్టీ కోసం పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని, వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని హరీష్ రావు హామీ ఇచ్చారు.

Ramayampet BRS Joinings: పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలకు, గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంటారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, నాయకులు చౌదరి సుప్రభాతారావు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ కౌన్సిలర్లు చౌదరి చరిత, మద్దెల మాధవి, కొక్కు ప్రవీణ్, నాయకులు ఉమామహేశ్వర్, ఎస్ కే అహ్మద్, హాస్నోదీన్, దోమకొండ శ్రీనివాస్, రొయ్యల నవీన్, మద్దెల రమేష్, పుట్టి స్వామి, పోచమ్మ శివయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

తెలంగాణ 10వ తరగతి ఫలితాలు.. వెబ్‌సైట్ లింకులు ఇవే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha