Excise Constable Transfers: ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుళ్ళు వారి స్వంత జిల్లాల్లో పని చేయకూడదు అన్న నిబంధన ను ఎత్తి వేయాలనీ, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్ళ సాధారణ బదిలీలలో భాగంగా ఐదురోజుల క్రితం ఎక్సైజ్ శాఖ బదిలీ నిబంధనల ను విడుదల చేసింది.
Read Also: Minister Seethakka: గ్రామ సభలు విజయవంతం
ఈ నిబంధన ల్లో ఎక్సైజ్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుల్లు ఇప్పటి వరకు పనిచేస్తున్న, వారి స్వంత జిల్లాలలో పనిచేయకూడదని 8ఎఫ్ క్లాజ్ ను చేర్చారని కింది స్థాయి ఉద్యోగుల విషయం లో ఇలాంటి నిబంధన విధించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
Excise Constable Transfers: Constables should be given postings in their own district: Jagga Reddy
150 మంది కానిస్టేబుళ్ల కుటుంబాలు
ఈ నిబంధన వల్ల సంగారెడ్డి జిల్లాలోని 150 మంది కానిస్టేబుళ్ల కుటుంబాలు, రాష్ట్ర వ్యాప్తంగా 3000 కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనీ ఆవేదన వ్యక్తంచేశారు. రెండు సంవత్సరాల్లో రిటైర్ అయ్యే హెడ్ కానిస్టేబుళ్ళు సైతం ఈ నిబంధన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారనీ ఆయన సిఎంకు ఎక్సైజ్ మంత్రికి తెలిపారు. కుటుంబాలకు దూరంగా ఉండటం తో పాటు, వారి పిల్లల చదువుల పై సైతం తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని మానవతా దృక్పథం తో ఈ 8 ఎఫ్ నిబంధను వెంటనే తొలగించాలని, ఈ విషయం లో పునరాలోచించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లను మీడియా ముఖంగా విజప్తి చేస్తున్నానీ తెలిపారు.
సంగారెడ్డి జిల్లా లో ఉన్న ఎక్సైజ్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ళు 150 మంది నా దగ్గర కు వచ్చి నన్ను కలిసి వారి సమస్యను విన్నవించారనీ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళమని వారు నాకు విజ్ఞప్తి చేశారు. సమయాభావం, అత్యవసర పరిస్థితి ఉన్నందున వెంటనే ఈ సమస్యను పరిశీలించి నిబంధన ను ఎత్తి వేయాలని, ఎవరికి ఇబ్బంది కలగకుండా బదిలీలు చేపట్టాలని ఎక్సైజ్ శాఖ మంత్రిని, ముఖ్య మంత్రిని ఆయన కోరారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

