Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కార్మిక కుటుంబాలకు తీపి కబురు.. పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ!

కార్మిక కుటుంబాలకు తీపి కబురు.. పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ!

వార్త 2 weeks ago

Singareni: సింగరేణి కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించి, వచ్చే 15 రోజుల్లో దాదాపు 250 నుంచి 300 పెండింగ్ డిపెండెంట్ పోస్టులకు క్లియరెన్స్ ఇచ్చి అర్హులైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేయాలని స్పష్టం చేశారు.

Read also: KCR : ఎర్రవల్లిలో ఆ 45 ఎకరాలు ఎక్కడో తేల్చండి - సీఎం రేవంత్

136 పెండింగ్ కేసులపై మానవీయ దృక్పథం

డిపెండెంట్ ఉద్యోగాల పేర్ల మార్పులకు సంబంధించి దాదాపు 136 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని అధికారులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన, సింగరేణి అధికారుల కమిటీ చేసిన సిఫారసులను మానవీయ కోణంలో పరిశీలించి, కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగేలా త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

ఏరియా ఆసుపత్రుల్లోనే ప్రతి నెలా మెడికల్ బోర్డు

కార్మికులకు వైద్య పరీక్షల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం ప్రతీసారి కొత్తగూడెం వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సింగరేణి పరిధిలోని అన్ని ఏరియా ఆసుపత్రుల్లోనే ప్రతి నెలా మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహించాలని భట్టి సూచించారు. అక్కడే తనిఖీలు పూర్తి చేసి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.

ఉద్యోగాలు కోల్పోయిన వారికి 'వన్ టైమ్ ఆప్షన్'

కరోనా మహమ్మారి సమయంలో లేదా ఇతర స్థానిక ప్రతికూల పరిస్థితుల వల్ల విధులకు హాజరుకా లేక ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అలాంటి వారికి మానవీయ ఆధారంగా ‘వన్ టైమ్ ఆప్షన్’ కింద తిరిగి విధుల్లో చేరే వెసులుబాటు కల్పించాలని ఉపముఖ్యమంత్రి సింగరేణి యాజమాన్యానికి సూచించారు.

ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపేందుకు సిద్దమైన రేవంత్ సర్కార్ - హరీష్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha