Dailyhunt
కార్టూన్లతో రిలాక్స్ అవుతా.. బ్యాటింగ్ అదరగొడతా! వైభవ్ సూర్యవంశీ

కార్టూన్లతో రిలాక్స్ అవుతా.. బ్యాటింగ్ అదరగొడతా! వైభవ్ సూర్యవంశీ

వార్త 1 week ago

Vaibhav Suryavanshi: బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుకు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.

కేవలం తన బ్యాటింగ్‌తోనే కాకుండా, తన మాతృభాష పట్ల ఉన్న మక్కువతో అతను ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాడు.

Read Also:IPL 2026 : నికోలస్ పూరన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న లక్నో ఫ్యాన్స్

Vaibhav Suryavanshi: ఏం జరిగిందంటే?

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ 8 పరుగులకే ఔటైనప్పటికీ, మ్యాచ్ తర్వాత బ్రాడ్‌కాస్టర్లతో మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.తర్వాతి మ్యాచ్‌ల ప్రణాళికల గురించి అడగగా.. ఏమాత్రం తడబడకుండా తన అచ్చమైన భోజ్‌పురి యాసలో సమాధానమిచ్చాడు."ప్లాన్ ఏముంది సార్, మంచిగా ఆడాలి.. తర్వాతి మ్యాచ్‌లో గెలిచి రెండు పాయింట్లు తీసుకుని ప్లేఆఫ్స్ వైపు అడుగులు వేయాలి" (Plan ka ba sir, bas badhiya khele ke ba…) అని అతను చెప్పిన తీరుకు మాజీ క్రికెటర్లు సైతం ఫిదా అయ్యారు.

తాను ఇప్పటికీ కూడా టీవీలలో కార్టూన్లు చూస్తానని తాజాగా వైభవ్ వెల్లడించారు. వాటిని చూస్తూనే క్రికెట్ పైన దృష్టి పెడుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ 15 ఏళ్ల వయసులో రెండిటి పైన దృష్టి పెట్టడం చాలా కష్టం. కానీ వైభవ్ మాత్రం కార్టూన్లతో పాటు… బ్యాటింగ్ కూడా ఇరగదీస్తున్నాడు.ప్రతి మ్యాచ్ కు ముందు కార్టూన్లు చూడాల్సిందేనని..

ఆ తర్వాత రిలాక్స్ అయి, బ్యాటింగ్ అదరగొడతానని వెల్లడించాడు. ఒక మ్యాచ్ లో విఫలమయ్యానని.. మరో మ్యాచ్ కంటే ముందు డీలా పడిపోను అంటూ వ్యాఖ్యానించారు. మరింత అద్భుతంగా ఆడేందుకు ప్రయత్నిస్తా తప్ప, ఒత్తిడిలోకి వెళ్లబోనని వైభవ్ తెలిపారు. ఈ సారి రాజస్థాన్ రాయల్స్ జట్టును ఛాంపియన్ చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నాడు వైభవ్.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

తల్లి అంత్యక్రియలు ముగిసిన వెంటనే జట్టులోకి ముకేశ్ చౌదరి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha