Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కార్యకర్తల సంక్షేమానికి పెద్ద పీట - ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి

కార్యకర్తల సంక్షేమానికి పెద్ద పీట - ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి

వార్త 2 months ago

Tadipatri: తెలుగుదేశం పార్టీ (TDP) కార్యకర్తల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి అన్నారు. పెద్దవడుగురు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త రమేష్ నాయుడు ప్రమాదవశాత్తు మరణించగా ప్రమాద బీమా కింద మంజూరైన రూ.

5 లక్షల మొత్తం భార్య వాణి ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శనివారం మృతి చెందిన రమేష్ నాయుడు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే అష్మిత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా జేసీ అష్మిత్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమం గురించి మొదట ఆలోచించి అమలు చేసిన పార్టీ దేశంలో ఒక్క టిడిపి మాత్రమే అన్నారు.

Read Also: Food adulteration : పర్యవేక్షణలోపమే కల్తీ పాలు లకు ప్రధాన కారణం

Tadipatri: కార్యకర్తలందరికీ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది

సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.5లక్షల ప్రమాద బీమా అందించడం దేశంలో మొదటిసారిగా ప్రారంభించినట్లు తెలిపారు. ఆర్థిక సమస్యలతో కార్యకర్తల పిల్లల చదువులు ఆగిపోతే వారిని చదివిస్తోందని, కార్యకర్తలకు వారి పిల్లలకు విద్య, స్వయం ఉపాధి కల్పించటం, కెరీర్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అందించటం,వృతిపరమైన ఉద్యోగావకాశాలు కల్పించటం జరుగుతొందన్నారు. పార్టీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్న కార్యకర్తలందరికీ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

శింగనమల అభివృద్ధికి పక్కా ప్రణాళిక: ఎమ్మెల్యే బండారు శ్రావణి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha