Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శింగనమల అభివృద్ధికి పక్కా ప్రణాళిక: ఎమ్మెల్యే బండారు శ్రావణి

శింగనమల అభివృద్ధికి పక్కా ప్రణాళిక: ఎమ్మెల్యే బండారు శ్రావణి

వార్త 2 months ago

Singanamala: శింగనమల నియోజకవర్గ 2026-27 బడ్జెట్ పై సమీక్ష సమావేశం శనివారం మండల కేంద్రంలోని యంపిడిఓ కార్యాలయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ.

ఆర్డిఓ కేశవ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులు అవగాహన కలిగి ఉండాలని. వేసవికాలం ప్రారంభమైనందున బడ్జెట్లో త్రాగునీరు సాగునీరుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. గ్రామాలలో రోడ్ల నిర్మాణం పక్కా గృహాల నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ఇప్పటివరకు అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారి జాబితా తయారు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

Read Also: Mamata Banerjee : 'మమతావేశం!

 Singanamala: A solid plan for the development of Singanamala: MLA Bandaru Sravani

ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిలో కూడా ముందుకు వెళ్తున్నాం అన్నారు. నియోజకవర్గ బడ్జెట్ ప్రతిపాదనలు ప్రజలకు అనుకూలంగా ఉపయోగపడేలా చూడాలన్నారు. అనంతరం ఆర్డీఓ కేశవ నాయుడు మాట్లాడుతూ శింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు ఎక్కువ ఉన్నందున వారు పండించిన పంట ఎగుమతికి అవకాశం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

గ్రామాలలో పాడి పశువులు పెంపకానికి అధిక ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్. హౌసింగ్ డిఈ రామ్మూర్తి. పంచాయతీరాజ్ డిఈ కృష్ణ జ్యోతి. ఐసిడిఎస్ సిడిపిఓ చల్లా లలిత. డిప్యూటీ తాసిల్దార్ సూర్య ప్రతాప్ యాదవ్. టిడిపి మండల కన్వీనర్ గోరంట్ల మారుతి నాయుడు. రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ కార్యనిర్వాహక కార్యదర్శి డేగల కృష్ణమూర్తి. రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం ఆదినారాయణ. సింగిల్ విండో అధ్యక్షుడు గుర్రం లక్ష్మీనారాయణ. ఆయకట్టు చైర్మన్ బోయ సత్యనారాయణ. మాసూలు చంద్రమోహన్. మాజీ సర్పంచులు రాజు. రమేష్. మునీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha