KTR warning to Congress: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తన రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, ప్రత్యర్థులపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన తగ్గేదే లేదని స్పష్టం చేశారు.
Read also: Peddashankarampet Handloom Society: చేనేత సహకార సంఘం ఎన్నిక ఏకగ్రీవం
Won’t spare anyone who troubles party workers: KTR issues stern warning.
KTR warning to Congress: చిట్టినాయుడు బృందానికి సినిమా చూపిస్తా..
సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాగా తాను అంత మంచివాడిని కాదని వ్యాఖ్యానించారు. “రాబోయే ఐదేళ్ల కాలంలో జరిగిన ఏ విషయాన్నీ మేము మర్చిపోము. మా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని, అక్రమంగా కేసులు పెట్టి సతాయించిన వారిని అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అదే సమయంలో కష్టకాలంలో పార్టీతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాం” అని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “రాబోయే ఐదేళ్లలో చిట్టినాయుడుకు, ఆయన వెనక ఉన్న బృందానికి అసలైన సినిమా చూపెట్టే బాధ్యత నాది. దీన్ని పక్కాగా అమలు చేస్తా, ఎవరినీ విడిచిపెట్టను” అని హెచ్చరించారు. బీఆర్ఎస్ శ్రేణులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్న వారికి రాబోయే రోజుల్లో గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ఎక్కడున్నా వెతికి మరీ పట్టుకుంటాం!
బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్న అధికారులకు, నాయకులకు కేటీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. “మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారు ఉద్యోగ విరమణ చేసినా, ఇక్కడి నుంచి పారిపోయినా, చివరకు సప్తసముద్రాల అవతల దాక్కున్నా సరే.. ఒక్కొక్కడినీ వెతికి పట్టుకుని వస్తాం. వాళ్లను మీ (కార్యకర్తల) ముందట నిలబెట్టే బాధ్యత నాది. ఇది ఊరికే చెబుతున్న మాటలు కావు, రాసి పెట్టుకోండి” అంటూ కేటీఆర్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
భువనగిరి కోటకు కొత్త ఆకర్షణ.. అక్టోబర్ నాటికి అందుబాటులోకి రోప్‌వే

