Telangana cabinet meeting: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. డిజిటల్ పరిపాలనలో భాగంగా రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ..
ఈ సమావేశాన్ని పూర్తిగా ‘పేపర్ రహితం’ (Digital e-Cabinet) గా నిర్వహించబోతున్నారు. మంత్రులందరికీ ప్రత్యేక ట్యాబ్‌లను అందజేసి, అజెండా, ఫైళ్లను డిజిటల్ రూపంలోనే అందుబాటులో ఉంచారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలపై ముమ్మరంగా చర్చించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ స్థానంలో కొత్తగా ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్’ (VB-G RAM G) పథకం అమలుపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనుంది. ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై పడే 40 శాతం అదనపు ఆర్థిక భారం మరియు నిబంధనలపై నియమించిన కేబినెట్ సబ్ కమిటీ నివేదికను ఈ సమావేశంలో పరిశీలించనున్నారు. దీనిపై రాష్ట్రం తరఫున ఒక స్పష్టమైన మరియు తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
Read Also: Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరు చూస్తే బిగ్ బాస్ షో చూస్తున్నట్టుంది: బండి సంజయ్
Cabinet meeting set to begin shortly.
Telangana cabinet meeting ఖరీఫ్ సీజన్ సన్నద్ధత.. ఎల్‌నినోపై ప్రణాళికలు
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విత్తనాలు, ఎరువుల పంపిణీ ప్రక్రియను కేబినెట్ సమీక్షించనుంది. ముఖ్యంగా ఎల్‌నినో (El Nino) పరిస్థితులు, వర్షభావం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా వ్యవసాయ శాఖ సిద్ధం చేసిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే అంశాన్ని కూడా పరిశీలించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది పునరుజ్జీవనం మరియు ప్రక్షాళన ప్రాజెక్టుకు సంబంధించిన తొలిదశ పనుల డీపీఆర్ (DPR) కు ఈ సమావేశంలో కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీనితో పాటు, హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 విస్తరణ పనుల పురోగతి, కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు, నిధుల సాధన కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రిమండలి సుదీర్ఘంగా చర్చించి ఆమోదముద్ర వేయనుంది.
Epaper: epaper.vaartha.com

