Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కావ్య మారన్ అనిరుధ్ పెళ్లి వార్తలు నిజమేనా?

కావ్య మారన్ అనిరుధ్ పెళ్లి వార్తలు నిజమేనా?

వార్త 3 months ago

Kavya Maran: సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ అనిరుధ్ పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హల్‌చల్ చేస్తున్నాయి. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ ఈ ఏడాది చివర్లో వివాహం చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి.

వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ప్రేమ నడుస్తోందని, త్వరలోనే ఇరు కుటుంబాల నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Read also: Rohit Sharma Fitness: రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం

 Kavya Maran Anirudh marriage rumors

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డేటింగ్ రూమర్స్

గత ఏడాది జూన్ నుండి వీరిద్దరి రిలేషన్‌షిప్ గురించి ఎక్స్, రెడ్డిట్ వేదికల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. వీరు విదేశాల్లో కలిసి తిరిగినట్లు, అక్కడ డిన్నర్ డేట్‌లలో ఎంజాయ్ చేసినట్లు కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌లో అనిరుధ్ వరుసగా పెద్ద సినిమాలకు సంగీతం అందించడం కూడా ఈ పుకార్లకు కారణమైంది. తాజాగా ఈ పెళ్లి సంబంధం కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా రంగంలోకి దిగి మాట్లాడారనే ఊహాగానాలు తమిళ మీడియాలో వినిపిస్తున్నాయి.

Kavya Maran: పెళ్లి పుకార్లపై రాక్‌స్టార్ అనిరుధ్ అదిరిపోయే సమాధానం

ఇటీవల ఒక పబ్లిక్ ఈవెంట్‌లో రిపోర్టర్ పెళ్లి గురించి అడగగా అనిరుధ్ నవ్వుతూ తమిళంలో మళ్లీ ఇదేనా అన్నట్లు సింపుల్‌గా దాటవేశారు. గతంలో కూడా ఆయన ట్విట్టర్ వేదికగా పెళ్లి వార్తలను కొట్టిపారేస్తూ రూమర్స్ ఆపండి అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అనిరుధ్ జైలర్ 2, కింగ్ వంటి పెద్ద సినిమాలతో బిజీగా ఉండగా, కావ్య మారన్ ఐపీఎల్, సౌతాఫ్రికా టీ20 లీగ్ పనులతో బిజినెస్ ఉమెన్‌గా బిజీగా గడుపుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేయనున్న 15 ఏళ్ల కుర్రాడు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha