Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం

రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం

వార్త 3 months ago

Rohit Sharma Fitness: ఇండియన్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 2027 వన్డే ప్రపంచకప్ సమయానికి ఆయన పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటారా లేదా అనే అనుమానాలు బీసీసీఐ వర్గాల్లో మొదలయ్యాయి.

త్వరలో జరగబోయే ఆఫ్ఘనిస్థాన్ వన్డే సిరీస్‌కు రోహిత్‌ను ఎంపిక చేసినప్పటికీ ఆయన ఆడటం అనేది కేవలం ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అవడంపైనే ఆధారపడి ఉంది. 40 ఏళ్లకు వయసు దగ్గరపడుతుండటంతో ఆయన శరీరం గాయాల నుండి కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటోందని సెలక్టర్లు భావిస్తున్నారు.

Read also: IPL 2026 sixes : క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేయనున్న 15 ఏళ్ల కుర్రాడు..

 Updates on Rohit Sharma Fitness report

వన్డేల్లో 50 ఓవర్లు ఫీల్డింగ్ చేయడం రోహిత్‌కు కష్టమేనా?

ఇటీవల ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ మ్యాచులు ఆడిన సమయంలో రోహిత్ గాయపడి కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఐపీఎల్ లాగా వన్డేల్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ఉండదు కాబట్టి మైదానంలో పూర్తి స్థాయిలో 50 ఓవర్లు ఫీల్డింగ్ చేయడం రోహిత్ శరీరానికి భారంగా మారే అవకాశం ఉంది. ఈ వయసులో గాయాల భయాలు ఎక్కువగా ఉండటంతో రోహిత్ భవిష్యత్తు ఆటపై సెలక్టర్లు ఒక గట్టి నిర్ణయం తీసుకునేలా కనిపిస్తున్నారు. ఆయన ఆటతీరులో మునుపటి దూకుడు తగ్గడం కూడా టీమ్ మేనేజ్‌మెంట్‌లో కొంచెం అసంతృప్తిని కలిగిస్తోంది.

Rohit Sharma Fitness: కోహ్లీతో పోలిక వద్దు.. ప్రత్యామ్నాయ ఓపెనర్ల వేటలో సెలక్టర్లు

ఫిట్‌నెస్ విషయంలో విరాట్ కోహ్లీతో రోహిత్ శర్మను అస్సలు పోల్చలేమని క్రికెట్ బోర్డు స్పష్టం చేస్తోంది. కోహ్లీ ఫామ్, ఫిట్‌నెస్ చాలా అద్భుతంగా ఉన్నాయని.. రోహిత్ విషయంలో మాత్రం బీసీసీఐ మెడికల్ టీమ్ ఇచ్చే రిపోర్ట్ కీలకం కానుంది. రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడానికి సెలక్టర్లు ఇప్పుడే యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌తో పాటు ఇషాన్ కిషన్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా సిద్ధం చేస్తున్నారు. మెగా టోర్నీ సమయానికి ఓపెనర్లు గాయపడితే ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే బోర్డు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

హార్దిక్ పాండ్యకు భారీ షాక్.. మ్యాచ్ ఫీజులో 10% కోత!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha