AP Crime: ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రయాణికులతో పాటు రైల్వే సిబ్బంది రక్షణను ప్రశ్నార్థకం చేస్తూ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేగంగా కదులుతున్న రైలు ఇంజన్‌ను టార్గెట్ చేస్తూ గుర్తుతెలియని దుండగులు రాళ్ల దాడికి (Stone Pelting) తెగబడ్డారు.
ఈ కిరాతక ఘటనలో రైలు నడుపుతున్న లోకో పైలట్ తీవ్రంగా గాయపడ్డారు.
Read Also :Nellore Crime News:యువకుడిని చంపేందుకు ప్లాన్.. నెల్లూరులో 10 మంది అరెస్ట్!
కదిలే రైలుపై కాపు కాసి దాడి

దేశ రాజధాని ఢిల్లీ (New Delhi) నుండి తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుపై ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘోర దాడి జరిగింది. చీకట్లో రైలు పట్టాల పక్కన కాపు కాసిన దుండగులు.. రైలు వేగంగా వెళ్తుండగా నేరుగా ఇంజన్ ముందు భాగంలోని అద్దాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద పెద్ద రాళ్లను విసిరారు. ఈ దాడిలో ఇంజన్ విండ్‌షీల్డ్ అద్దాలు ముక్కలై లోపల ఉన్న సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) జయరామ్‌కు బలంగా తగిలాయి. రాళ్ల దెబ్బకు ఆయన తల, ముఖంపై తీవ్ర గాయాలై రక్తస్రావమైంది.
AP Crime: అప్రమత్తమైన సిబ్బంది.. ఆసుపత్రికి తరలింపు
రైలు ఇంజన్‌పై దాడి జరిగినప్పటికీ ప్రధాన లోకో పైలట్ అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించారు. గాయపడిన తోటి ఉద్యోగి పరిస్థితిని గమనించి, రైలును కంట్రోల్ చేస్తూ సమీపంలోని ఉలవపాడు (Ulvapadu – UPD) రైల్వే స్టేషన్‌లో అత్యవసరంగా నిలిపివేశారు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), స్టేషన్ అధికారులు తీవ్ర రక్తస్రావమైన జయరామ్‌కు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.
రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు
రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడమే కాకుండా, వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతూ లోకో పైలట్లపై దాడికి తెగబడిన ఈ ఘటనపై రైల్వే పోలీసులు (GRP) సీరియస్ అయ్యారు. సింగరాయకొండ – ఉలవపాడు పరిసర ప్రాంతాల్లోని రైల్వే ట్రాక్ పక్కన తిరిగే ఆకతాయిలు, పాత నేరస్థులపై నిఘా పెట్టారు. ఈ దాడికి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
నెల్లూరులో భారీ చోరీ.. 210 గ్రాముల బంగారం మాయం!

