Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నెల్లూరులో భారీ చోరీ.. 210 గ్రాముల బంగారం మాయం!

నెల్లూరులో భారీ చోరీ.. 210 గ్రాముల బంగారం మాయం!

వార్త 2 months ago

Nellore Gold Theft Case: నెల్లూరు నమ్మకంతో ఇంటి తాళాలను బయట దాచడం ఓ కుటుంబానికి కోలుకోలేని భారీ నష్టాన్ని మిగిల్చింది. దొంగలు అదను చూసి తాళం తీసి లోపలికి ప్రవేశించి, బీరువాలో దాచి ఉంచిన సుమారు 210 గ్రాముల (21 తులాల) బంగారు ఆభరణాలను అపహరించుకుపోయిన సంచలన ఘటన నెల్లూరు నగరంలోని కుమ్మరి వీధిలో చోటుచేసుకుంది.

Read Also: Nellore Crime News:యువకుడిని చంపేందుకు ప్లాన్.. నెల్లూరులో 10 మంది అరెస్ట్!

నగరంలోని స్థానిక కుమ్మరి వీధికి చెందిన షఫీ అనే వ్యక్తి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాధారణంగా ప్రతిరోజూ సాయంత్రం పిల్లలను ట్యూషన్‌కు తీసుకెళ్లే సమయంలో ఇంటి తాళాలను బయట ఉన్న వాషింగ్ మెషీన్‌ కవర్‌ లోపల దాచి ఉంచడం షఫీ భార్యకు అలవాటు. ఇదే అలవాటును కొనసాగిస్తూ, సంఘటన జరిగిన రోజు కూడా తాళాలను ఎప్పటిలాగే వాషింగ్ మెషీన్ కవర్‌లో ఉంచి కుటుంబ సభ్యులంతా కలిసి బయటకు వెళ్లారు.

ట్యూషన్ నుంచి వచ్చేసరికి బీరువా ఖాళీ..

పిల్లలను ట్యూషన్ నుండి తీసుకుని తిరిగి ఇంటికి వచ్చిన షఫీ భార్యకు తలుపులు తెరిచి ఉండటం చూసి ఒక్కసారిగా గుండె గుభేలుమంది. లోపలికి వెళ్లి చూడగా బెడ్‌రూమ్‌లో ఉన్న బీరువా తలుపులు పూర్తిగా తెరిచి ఉన్నాయి. ఆందోళనతో లోపల వెతకగా, దాచి ఉంచిన సుమారు 210 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దుండగులు ఇంటి బయట దాచిన తాళాన్ని కనిపెట్టి, దాంతోనే తలుపులు తీసి లోపలికి ప్రవేశించారని.. ఆపై ఎవరూ లేని సమయం చూసి బీరువాను పగలగొట్టి నగలన్నింటినీ దోచుకున్నారని ప్రాథమికంగా నిర్ధారించారు.

Nellore Gold Theft Case: రంగంలోకి చిన్నబజార్ పోలీసులు, క్లూస్ టీమ్

ఈ భారీ చోరీ ఘటనపై సమాచారం అందుకున్న చిన్నబజార్ పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల వేలిముద్రలు, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించేందుకు క్లూస్ టీమ్ (Clues Team) రంగంలోకి దిగింది. ఇంటి బయట నిర్ధేశిత ప్రదేశంలో తాళాలు ఉంచే అలవాటు ఉన్న విషయం చుట్టుపక్కల ఎవరికైనా తెలుసా? లేదా దొంగలే నిరంతరం ఇళ్లపై నిఘా పెట్టి ఈ ముఠా దోపిడీకి పాల్పడిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు స్థానిక వీధుల్లో ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రజలు తమ ఇంటి తాళాలను ఇలా పబ్లిక్ ప్రదేశాల్లో నిర్లక్ష్యంగా దాచవద్దని ఈ సందర్భంగా చిన్నబజార్ పోలీసులు హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ఏపీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల వేడుకలు.. చంద్రబాబు అధ్యక్షతన కీలక నేతల భేటీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha