Kalki 2898 AD Part 2: దర్శకుడు నాగ్ అశ్విన్ విజువల్ వండర్‌గా తెరకెక్కించిన 'కల్కి 2898 AD' ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ముగింపులో పార్ట్-2 పై ఇచ్చిన హింట్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచాయి.
తాజాగా ఈ సీక్వెల్ షూటింగ్, విడుదల తేదీపై ఫిలింనగర్ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది.
Read Also : బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ.. మాస్ సాంగ్‌తో రచ్చ
వేగంగా సాగుతున్న షూటింగ్

తాజా సమాచారం ప్రకారం, కల్కి పార్ట్-2 కి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే వేగవంతం అయింది. పార్ట్-1 సమయంలోనే కొన్ని ముఖ్యమైన భాగాలను షూట్ చేసిన నాగ్ అశ్విన్, ఇప్పుడు మిగిలిన భాగాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది (2027) ద్వితీయార్థం నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది.
Kalki 2898 AD Part 2: గ్రాఫిక్స్, మేకింగ్
షూటింగ్ జరుగుతుండగానే, గ్రాఫిక్స్ (VFX) పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయని టాక్. పార్ట్-1 కంటే రెట్టింపు స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఈ పార్ట్-2 లో ఉండబోతున్నట్లు సమాచారం. గ్రాఫిక్స్‌కు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నందున, అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది చివర్లో (2027 డిసెంబర్ నాటికి) సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అంచనాలు, కథ
మొదటి భాగంలో కర్ణుడిగా ప్రభాస్ క్యారెక్టర్ ఎలివేషన్, కమల్ హాసన్ ‘సుప్రీం యాస్కిన్’ పాత్రలు పార్ట్-2 పై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సీక్వెల్‌లో ప్రభాస్, కమల్ హాసన్ మధ్య వచ్చే ఘర్షణ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

