Kavitha New Party: తెలంగాణలో మరో రాజకీయ శక్తి ఆవిర్భవించబోతోంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని స్థాపించబోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తుండగా, తాజాగా పార్టీ ఆవిర్భావ సభ ప్రాంగణంలో వెలిసిన బోర్డులు ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి.
Read Also :RTC Driver Shankar Goud: శంకర్ గౌడ్ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే:కేటీఆర్
Kavitha enters the field under the name of Praja Vikas Samiti
Kavitha New Party: ప్రజా జాగృతి కాదు.. ప్రజావికాస్ సమితి?
ఇప్పటివరకు ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అనే పేరు ప్రచారంలో ఉండగా, అనూహ్యంగా ‘తెలంగాణ ప్రజావికాస్ సమితి’ అనే పేరుతో స్వాగత తోరణాలు వెలిశాయి. ఈ బోర్డులపై తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైన గోల్కొండ కోట మరియు కాకతీయ తోరణం చిత్రాలను పొందుపరిచారు. ఇది రాష్ట్ర వారసత్వాన్ని, ప్రజల వికాసాన్ని కాంక్షిస్తూ పెట్టిన పేరుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కొత్త పేరుతో కవిత ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

