Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కళ్యాణదుర్గంలో భక్త కనకదాస కళ్యాణమండపం

కళ్యాణదుర్గంలో భక్త కనకదాస కళ్యాణమండపం

వార్త 3 months ago

Kalyandurg Kanakadasa Kalyana Mandapam: కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా అర్ధాంతరంగా నిలిచిపోయిన శ్రీ భక్త కనకదాస కళ్యాణమండపం, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చొరవతో సరికొత్త శోభతో నిర్మాణం పూర్తిచేసుకుని కురుబ సామాజిక వర్గానికి అందుబాటులోకి రావడం హర్షణీయమని నియోజకవర్గ కురుబ సంఘ నాయకులు తెలిపారు.

నియోజకవర్గంలోని కురుబ సామాజిక వర్గ ప్రజలు ఎంతోకాలంగా కళ్యాణ మండపం పూర్తి కావాలని ఎదురు చూస్తుండగా, వారి విజ్ఞప్తికి స్పందించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి సహకారంతో ఎంపీ నిధుల ద్వారా రూ.25 లక్షలు మంజూరు చేయించి నిర్మాణ పనులు పూర్తిచేయించి నట్లు పేర్కొన్నారు. దీంతో ఎన్నాళ్లుగానో నిలిచిపోయిన కళ్యాణమండపం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుని కొత్త కళను సంతరించుకుందని ఆనందం వ్యక్తం చేశారు.

Read Also:Renuka Chowdhury : భట్టిపై MP రేణుకా చౌదరి ఆగ్రహం

ఈ సందర్భంగా నియోజకవర్గ కురుబ సంఘం అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కురుబ సామాజిక వర్గం కోసం రూ.20 లక్షలతో శ్రీ భక్త కనకదాస కమ్యూనిటీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరయ్యా యని తెలిపారు. అప్పట్లో సుమారు 70 శాతం పనులు పూర్తయ్యా యని, అనంతరం ప్రభుత్వం మారడంతో నిర్మాణ పనులు నిలిచి పోయాయని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో కురుబ సామాజిక వర్గానికే చెందిన నాయకత్వం ఉన్నప్పటికీ, నిలిచిపోయిన కళ్యాణమండప నిర్మాణానికి నిధులు రాలేదని, దీంతో భవనం దాదాపు నిరుపయోగంగా మారిపోయిందని అన్నారు.

 Kalyandurg Kanakadasa Kalyana Mandapam

అనంతరం ఎమ్మెల్యేగా సురేంద్రబాబు బాధ్యతలు చేపట్టి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న సమయంలో ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి ఎంపీ నిధుల ద్వారా రూ.25 లక్షలు మంజూరు చేయించి నిర్మాణాన్ని పూర్తిచేయించారని వివరించారు. కురుబ సామాజిక వర్గ అభ్యున్నతికి ఎమ్మెల్యే సురేంద్రబాబు విశేష ప్రాధాన్యత ఇస్తున్నారని, కంబదూరు రోడ్డులో స్వంత నిధులతో శ్రీ భక్త కనకదాస విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడం కూడా గర్వకారణమని తెలిపారు. శ్రీ భక్త కనకదాస కళ్యాణమండపం పూర్తి కావడంతో నియోజకవర్గ కురుబల ఆశయం నెరవేరిందని, ఇందుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు కురుబ సామాజిక వర్గ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని నాగరాజు పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఢిల్లీకి చంద్రబాబు.. జల వివాదాలపై కేంద్రంతో తేల్చుకోనున్న ఏపీ సీఎం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha