Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నటిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నా బాధ తప్పలేదు: రెజీనా కాసాండ్రా ఎమోషనల్

నటిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నా బాధ తప్పలేదు: రెజీనా కాసాండ్రా ఎమోషనల్

వార్త 2 months ago

Regina Cassandra: తెలుగు, తమిళ ప్రేక్షకులకి సుపరిచితురాలైన నటి రెజీనా కాసాండ్రా గ్లామర్ పరంగా, నటన పరంగా తనను తాను నిరూపించుకున్నప్పటికీ, కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఆశించిన స్థాయిలో స్థిరపడలేకపోయారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన గత ప్రేమాయణం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

Read Also:Siddharth Venugopal: క్యాన్సర్‌తో పోరాడుతూ మలయాళ బుల్లితెర నటుడు సిద్ధార్థ్ కన్నుమూత!

Regina Cassandra: ప్రేమ విఫలం.. కన్నీటి పర్యంతం!

తన రిలేషన్ గురించి చెబుతూ.. “ఒకానొక సమయంలో నేను ఒకరిని గాఢంగా ప్రేమించాను. ఆ బంధం కోసం ఎంతో ప్రాధాన్యత ఇచ్చాను. కానీ ఆ రిలేషన్‌లో నాకు తెలియకుండానే నేను చాలా నష్టపోయాను. ప్రేమించిన వ్యక్తి నుంచి ఆశించిన మద్దతు లభించకపోగా, మానసికంగా ఎంతో కుంగిపోయాను. ఆ చేదు అనుభవం నుంచి బయటపడటానికి నాకు చాలా సమయం పట్టింది” అని రెజీనా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉంటున్నానని, తన ఫోకస్ అంతా పనిపైనే ఉందని స్పష్టం చేశారు.

 Regina Cassandra emotional about relationship

కెరీర్ స్ట్రగుల్స్: స్టార్‌డమ్ అందని ద్రాక్షేనా?

రెజీనా తన కెరీర్‌ను చాలా చిన్న వయసులోనే ప్రారంభించారు.సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 20 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ, స్టార్ హీరోయిన్ హోదా మాత్రం దక్కలేదు.గ్లామర్ షో నుండి 'ఆచార్య'లో ఐటమ్ సాంగ్ వరకు అన్నింటికీ ఓకే చెప్పినా, అదృష్టం మాత్రం ఆమె తలుపు తట్టలేదు.తెలుగులో అవకాశాలు తగ్గినప్పుడు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ప్రయత్నించారు. ప్రస్తుతం ఆమె చేతిలో తమిళంలో ‘మూకుతి అమ్మన్ 2’, ‘ఫ్లాష్‌బ్యాక్’ వంటి సినిమాలు ఉన్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

క్షమాపణ చెప్పాల్సిందే.. లేదంటే కోర్టుకే! ప్రకాశ్ రాజ్‌కు భానుప్రకాశ్ రెడ్డి నోటీసులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha