Salman Khan: దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సల్మాన్ ఖాన్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్ చిత్రం (తాత్కాలికంగా SVC63) ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించుకుంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Read Also: Chahal vs Tanya: నటి తాన్యా ఛటర్జీపై యజువేంద్ర చాహల్ పరువు నష్టం దావా

Salman Khan: హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా
వంశీ పైడిపల్లి మార్క్ ఎమోషన్స్, సల్మాన్ ఖాన్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ చిత్రంలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. సల్మాన్, నయనతార తొలిసారి వెండితెరపై జంటగా కనిపించబోతుండటంతో ఈ సినిమాపై బాలీవుడ్‌తో పాటు సౌత్ మార్కెట్‌లోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
ఈ నెల నుంచే షూటింగ్ మొదలవుతుందని గతంలోనే ప్రకటించిన చిత్ర బృందం, ఈరోజు నుంచి కెమెరా ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించింది. టాలీవుడ్ దిగ్గజ నిర్మాత దిల్ రాజు నేరుగా సల్మాన్ ఖాన్‌తో సినిమా చేయడం ఇదే మొదటిసారి. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును వచ్చే ఏడాది (2027) ప్రథమార్ధంలో విడుదల చేసేందుకు చిత్ర బృందం పక్కా ప్లాన్‌తో ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
నటిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నా బాధ తప్పలేదు: రెజీనా కాసాండ్రా ఎమోషనల్

